మాజీ సైనికుడిపై దాడి

15 Jun, 2018 14:50 IST|Sakshi
గాయాలతో చికిత్స పొందుతున్న రామారావు 

వేపగుంట(గోపాలపట్నం) : ఉత్సవంలో తన సోదరుడి కుమారుడిపై దాడి చేస్తున్నారేంటని అడిగిన మాజీ సైనికుడిపై ఓ వ్యక్తి ఇనుప రాడ్డులో మోదాడు. ఈ ఘటనలో ఆయన తీవ్రగాయాలపాలయ్యాడు.

ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించి పెందుర్తి పోలీసులు తెలిపిన వివరాలివి. నరవ గ్రామంలో ఈ నెల 12న పైడితల్లమ్మ ఉత్సవంలో ఊరేగింపు జరుగుతుండగా,  భాస్కర్‌ అనే యువకుడిపై కొందరు వివాదా నికి దిగి దాడి చేశారు.

ఇదేంటని భాస్కర్‌ పెదనాన్న చింతల రామారావు(ఆర్మీ మాజీ ఉద్యోగి) ప్రశ్నించడంతో ఆయనపైనా దాడికి దిగారు. వరహాలరావు అనే వ్యక్తి రాడ్డుతో ఆయన తలపై మోదడంతో తీవ్ర గాయాలయ్యాయి.

వివాదానికి కారణమైన వారిలో వరహాలరావుతో పాటు కోటేశ్వరరావు, శ్రీను, శివ అనే వ్యక్తులు ఉన్నట్లు రామారావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాడి జరిగిన రోజు తనను తీవ్ర భయాందోళనకు గురి చేశారని ఆందోళన వెలిబుచ్చారు.  

మరిన్ని వార్తలు