సురేష్‌పై దాడి; 14 మందిపై కేసు నమోదు

4 Feb, 2020 10:38 IST|Sakshi

సాక్షి, నందిగామ: రాజధాని ఉద్యమం పేరుతో బాపట్ల వైఎస్సార్‌సీపీ ఎంపీ నందిగం సురేష్‌పై దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ జి.వి.రమణమూర్తి తెలిపారు. నందిగామ పోలీస్‌స్టేషన్‌లో సోమవారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. ఎంపీ సురేష్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మొత్తం 14 మందిపై కేసు నమోదు చేశామని డీఎస్పీ తెలిపారు.  (నాపై దాడి వెనుక ఆ ఇద్దరి హస్తం ఉంది: సురేష్‌)

దళిత ఎంపీపై ఉద్దేశపూర్వకంగానే దాడి
నవ్యాంధ్ర ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు పరిశపోగు శ్రీనివాసరావు
నెహ్రూనగర్‌ (గుంటూరు): దళిత ఎంపీ నందిగం సురేష్‌పై దాడి చేసిన వారిపై వెంటనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని నవ్యాంధ్ర ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు పరిశపోగు శ్రీనివాసరావు మాదిగ డిమాండ్‌ చేశారు. దాడికి నిరసనగా అన్ని జిల్లాల్లో అంబేడ్కర్‌ విగ్రహాల వద్ద ఆందోళన తలపెట్టామన్నారు. గుంటూరు లాడ్జి సెంటర్‌లోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద సోమవారం నిరసన తెలిపారు. అనంతరం మాట్లాడుతూ అమరావతి విషయంలో టీడీపీ నాయకులు దళిత ఎంపీలను ఒక విధంగా, అగ్రకుల ఎంపీలను ఒక విధంగా చూస్తున్నారని, పద్ధతి మార్చుకోకపోతే దళితులంతా ఏకమై బుద్ధి చెబుతామన్నారు. అనంతరం చంద్రబాబు దిష్టిబొమ్మ దహనం చేశారు. (చదవండి: బాపట్ల ఎంపీ సురేష్‌పై టీడీపీ నేతల దాడి)

మరిన్ని వార్తలు