ఇరాక్‌లో యూఎస్‌ ఎంబసీపై దాడి

1 Jan, 2020 05:08 IST|Sakshi
అమెరికా ఎంబసీ ప్రాంగణంలో నిరసనలు

బాగ్దాద్‌: ఇరాన్‌ మద్దతున్న హిజ్బుల్‌ బ్రిగేడ్‌ తీవ్రవాద సంస్థ మద్దతుదారులు మంగళవారం ఇరాక్‌లోని బాగ్దాద్‌లో ఉన్న అమెరికా రాయబార కార్యాలయంపై దాడి చేసి విధ్వంసం సృష్టించారు. కార్యాలయం ప్రధాన ద్వారాన్ని ధ్వంసం చేసి, రిసెప్షన్‌ ప్రాంతాన్ని తగలబెట్టారు. ఇరాన్‌ మద్దతున్న తీవ్రవాద సంస్థ హషెద్‌ అల్‌ షాబికి  హిజ్బుల్‌ బ్రిగేడ్‌ సాయుధ విభాగం. దానికి ఇరాక్‌లో, సిరియాలో ఉన్న కీలక స్థావరాలపై అమెరికా ఆదివారం వైమానిక దాడులు జరిపిన విషయం తెలిసిందే.

ఆ దాడుల్లో పాతికమందికి పైగా చనిపోయారు. ఆ దాడులకు ప్రతీకారంగానే యూఎస్‌ రాయబార కార్యాలయంపై సోమవారం దాడి జరిగింది. మిలటరీ యూనిఫాం వేసుకున్న ఆందోళనకారులు ‘ఆక్రమణదారు అమెరికా’ అని ఉన్న ప్లకార్డులు పట్టుకుని ఈ దాడిలో పాల్గొన్నారు. ఆందోళనకారులను చెదర గొట్టడానికి అమెరికా సైనికులు టియర్‌ గ్యాస్‌ ప్రయోగించారు.  

మరిన్ని వార్తలు