పోలీసులపై దాడికి యత్నం   

8 Jun, 2018 13:43 IST|Sakshi
పోలీస్‌స్టేషన్‌లో వివరాలు అడిగి తెలుసుకుంటున్న డీఎస్పీ నాగేశ్వరరావు 

భార్యాభర్తల పంచాయితీ విషయంలో భర్త బంధువుల నిర్వాకం

రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో గంటన్నర పాటు ఉద్రిక్తత

ఆరుగురిపై కేసు నమోదు  

సూర్యాపేటరూరల్‌ : భార్యాభర్తల పంచాయితీ విషయంలో పోలీసులపై దాడికి యత్నించిన సంఘటన గురువారం సాయంత్రం సూర్యాపేటరూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ మండలం రాళ్లవాగుతండాకు చెందిన బాలునాయక్‌తో సూర్యాపేట మండలం య ర్కారం ఆవాసం దుబ్బతండాకు చెందిన లీలావతికు పదేళ్ల క్రితం వివాహమైంది.

వీరికి ఇద్దరు పిల్లలు సం తానం. అయితే కొంతకాలంగా అదనపు కట్నం తేవాలని వేధిస్తున్నాడంటూ భర్త బాలు నాయక్‌పై భార్య లీలావతి మూడు రోజుల క్రితం రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు విషయంలో ఫ్యామిలీ కౌన్సెలింగ్‌ ఇచ్చేందుకు గాను ఎస్‌ఐ శ్రీనువాస్‌ ఇరువర్గాలను గురువారం స్టేషన్‌కు పిలిపించారు.

స్టేషన్‌కు వస్తూనే పోలీసులపై ఆగ్రహం..?

మిర్యాలగూడ నుంచి బాలునాయక్, అతని తమ్ముడు రమేష్‌తో పాటు మరి కొందరు బంధువులు స్టేషన్‌ వద్దకు వచ్చారు. స్టేషన్‌కు వస్తూనే బాలునాయక్‌ తమ్ముడు రమేష్‌ తాను డీజీపీ వద్ద డ్రైవర్‌గా పని చేస్తానని, కేసు విషయంలో నువ్వు ఎంత తీసుకుని మమ్ముల్ని పిలిపించావని ఎస్‌ఐ శ్రీనివాస్‌తో వాగ్వాదానికి దిగారు.

స్టేషన్‌లో ఉన్న పోలీసులు బాలునాయక్, రమేష్‌లను సముదాయించి స్టేషన్‌ నుంచి బయటకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఫలితం లేకపోయింది. బాలునాయక్, రమేష్‌తో పాటు వచ్చిన బంధువులు అందరూ కలిసి పోలీసులపై దాడి చేసే యత్నించడంతో పోలీసులు అవాక్కయ్యారు. దాడికి యత్నించిన వారు మద్యంతాగి ఉండడంతో పోలీసులు సముదాయించినా  వినలేదు.  

భార్య బంధువుల ప్రతిఘటనతో..

అయితే బాలునాయక్‌ బంధువులు పోలీసులపై దాడికి యత్నిస్తున్న తీరును చూసి అవాక్కౖన లీలావతి బంధువులు ప్రతిఘటించి వెంబడించా రు. దీంతో బాలునాయక్‌ బంధువులు పరారీ కావడంతో గొడవ సద్దుమణిగింది. బాలునాయక్, బంధువులను సముదాయించే సమయంలో హోంగార్డు జానకిరాములు కిందపడిపోయాడు. 

ఆరుగురిపై కేసు నమోదు..

విధి నిర్వహణలో ఉన్న ఎస్‌ఐ, పోలీస్‌ సిబ్బందిపై దాడికి యత్నించిన ఘటనలో ఆరుగురిపై కేసు న మోదు చేసినట్లు సూర్యాపేట వన్‌టౌన్‌ ఎస్‌ఐ క్రాం తికుమార్‌ తెలిపారు. కేసు నమోదైన వారిలో రాళ్లవాగుతండాకు చెందిన బాలునాయక్, రమేష్, రా జేశ్వరి, రమావత్‌ శాంతి, వినోద, కవిత ఉన్నారు. 

స్టేషన్‌ను సందర్శించిన డీఎస్పీ

సూర్యాపేటరూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో జరుగుతున్న ఘర్షణ గురించి తెలుసుకున్న డీఎస్పీ నాగేశ్వరరావు స్టేషన్‌కు వచ్చారు. ఘర్షణ జరిగిన సంఘటన గురించి సీఐ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, ఎస్‌ఐ శ్రీని వాస్‌ను అడిగి తెలుసుకున్నారు. శాంతి భద్రతలు పరిరక్షించే పోలీస్‌లపై దాడి చేసే ప్రయత్నం చేయడం తగదని హెచ్చరించారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు