రెచ్చిపోయిన ఆటోడ్రైవర్లు.. పోలీసుల ఛేజింగ్‌

6 Jul, 2018 08:08 IST|Sakshi

ఆటోడ్రైవర్ల చేష్టలతో వాహనదారులు వణికిపోయారు. హైవేపై రేసులతో రెచ్చిపోయారు. దీంతో వాహనదారులు భయాందోళనలకు గురికాగా, సమాచారం అందుకున్న పోలీసులు వారిని వెంటాడి మరీ అరెస్ట్‌ చేశారు. తమిళనాడులోని చెన్నై హైవేలో ఈ ఘటన చోటు చేసుకుంది. 

సాక్షి, చెన్నై: నగరంలో ఆటోడ్రైవర్లు చెలరేగిపోయారు. చెన్నై హైవే ఔటర్‌ రింగ్‌ రోడ్‌పై రేసులు నిర్వహించి అడ్డంగా బుక్కయ్యారు. బైక్‌పై వెళ్తున్న కొందరు వారిని రెచ్చగొట్టంతో వారు మరింత వేగంతో దూసుకెళ్లటంతో వాహనదారులు భీతిల్లిపోయారు. అది గమనించిన పోలీసులు వారిని వెంటాడి మరీ పట్టుకున్నారు. సుమారు ఆరగంటకు పైగానే ఛేజింగ్‌ కొనసాగింది.  మొత్తం ఆరు ఆటోలను, ఐదుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం గాలింపు చేపట్టారు. ఇల్లీగల్‌ రేసులు, ట్రాఫిక్‌ ఉల్లంఘనతోపాటు వాహనదారులకు భయాందోళనలు గురి చేసినందుకు వారిపై కేసులు నమోదు చేశారు. కాగా, గతంలోనూ తరచూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయని అధికారి ఒకరు వెల్లడించారు. 

మరిన్ని వార్తలు