నేటికి ఆయేషా హత్య జరిగి పదేళ్లు

27 Dec, 2017 13:19 IST|Sakshi
ఆయేషా మీరా(ఫైల్‌)

నిందితులను పట్టుకోలేకపోయిన పోలీసులు

విజయవాడ లీగల్‌ :  రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బీఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య జరిగి నేటికి పదేళ్లు పూర్తయిందని న్యాయవాది పిచ్చుక శ్రీనివాస్‌ అన్నారు. నగరంలోగల సీవీఆర్‌ కాంప్లెక్స్‌లోని తన ఆఫీసులో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌ మాట్లాడుతూ నిమ్రా కాలేజీ విద్యార్థిని ఆయేషా మీరా 2007, డిసెంబర్‌ 26 అర్ధరాత్రి అత్యంత దారుణంగా హత్యకు గురై పదేళ్లు అయినప్పటికీ న్యాయం మాత్రం జరగలేదన్నారు.

ఆయేషా తల్లిదండ్రుల కన్నీటి ధార ఇంతవరకూ తొలగిపోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేసులో అభం, శుభం తెలియని దళితుడైన పిడతల సత్యం బాబును పోలీసులు అన్యాయంగా ఇరికించారని, అది హైకోర్టులో తేటతెల్లమైందని చెప్పారు. అసలు దోషులను  పట్టుకోమని హైకోర్టు ఆదేశించినప్పటికి పోలీసులు ఇంతవరకు సఫలంకాలేదని పేర్కొన్నారు. బుధవారం ఆయేషా కేసుపై స్థానిక ప్రెస్‌క్లబ్‌లో సమావేశం నిర్వహించనున్నట్లు, ఆయేషా తల్లి షంషద్‌ బేగం, తండ్రి సయద్‌ బాషాతో పాటు వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొంటారన్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

విడాకుల కోసం.. భార్యను స్నేహితుడితో..

వైఎస్‌ జగన్‌పై దాడి కేసులో హైకోర్టు సంచలన నిర్ణయం

కన్నతల్లి కర్కశత్వం; చిన్నారి గొంతుకోసి..

హల్దీ బచావో..

బిగ్‌బాస్‌ మాజీ కంటెస్టెంట్‌ అరెస్టు

వివాహేతర సంబంధం: భర్తకు తెలియకుండా 95 వేలు..

తనతో ప్రాణహాని; అందుకే నేనే చంపేశా!

వేటాడుతున్న నాటు తూటా

ఐదేళ్ల తర్వాత ప్రతీకారం..!

ఒంటరి మహిలళే వారి టార్గెట్‌!

ప్రియురాలి ఇంటి ఎదుట ప్రియుడి ఆత్మహత్య

ప్రభుత్వ ఆస్పత్రిలో మహిళ మృతి

మోసం: వయస్సు తప్పుగా చెప్పి పెళ్లి!

మలుపులు తిరుగుతున్న శిశువు కథ

ఉద్యోగమని మోసం చేసిన డీఎస్పీ!

అమ్మాయి చేతిలో ఓడిపోయానని..

దొంగలు బాబోయ్‌.. దొంగలు 

ప్రేమ... పెళ్లి... విషాదం...

నమ్మించాడు..  ఉడాయించాడు!

చంద్రబాబు, లోకేశ్‌ ఫొటోలతో కుచ్చుటోపీ!

విదేశీ ఖైదీ హల్‌చల్‌

భార్య ప్రియునిపై పగ; తొమ్మిదిమందికి షాక్‌..!

ప్రియుడు మోసం చేశాడని..బాలిక ఆత్మహత్య

అయ్యో! రూ.2 వేల కోసం విషా(వా)దం

సెల్ఫీ వీడియో తీసి బీటెక్‌ విద్యార్థి బలవన్మరణం

క్యాషియర్‌పై దాడి చేసిన దొంగలు దొరికారు

ట్రిపుల్‌ రైడింగ్‌.. ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌పై దాడి..!

బెట్టింగ్ చేసినందుకు ఐదుగురు అరెస్టు

డైరెక్టర్‌ రాజమౌళి.. యాక్టర్‌ లాయర్‌

మొబైల్‌ నెంబర్‌ మారుస్తున్నారా ! ఐతే జాగ్రత్త

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌ మాజీ కంటెస్టెంట్‌ అరెస్టు

‘ఆ విషయాలు నాగార్జున తెలుసుకోవాలి’

పీవీ కూడా ఆయన అభిమాని అట...

‘ది లయన్‌ కింగ్‌’.. ఓ విజువల్‌ వండర్‌!

‘సాహో’ విడుదల ఎప్పుడంటే..?

ఘోర రోడ్డు ప్రమాదం : బాలనటుడు దుర్మరణం