చెత్త డబ్బాలో చిన్నారి

12 Dec, 2019 10:01 IST|Sakshi
చెత్త కుప్పలో ఉన్న చిన్నారి కిర్తిక

వేలూరు: జోలార్‌పేట రైల్వేస్టేషన్‌ సమీపంలోని ఓంశక్తి ఆలయం వద్దనున్న మున్సిపల్‌ చెత్త బాక్సులో 11 నెలల చిన్నారి ఉండడాన్ని గమనించిన స్థానికులు అవాక్కయ్యారు. చిన్నారి కేకలు విన్న స్థానికులు చెత్త బాక్సులో చూడగా చీమలు కరుస్తున్న స్థితిలో చిన్నారి కనిపించింది. చిన్నారిని తీసుకుని పోలీస్‌ స్టేషన్‌లో అప్పగించారు. పోలీసులు జోలార్‌పేట ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. అనంతరం కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. చిన్నారి ఆలంగాయం సమీపంలోని పూంగులం గ్రామానికి చెందిన భవన నిర్మాణ కార్మికుడు ఆనందన్‌ ప్రియ దంపతుల కుమార్తె కిర్తిక అని తెలిసింది. ప్రియ రెండు రోజుల క్రితం చిన్నారితో ఇంటి నుంచి మాయమైంది. దీనిపై ప్రియ తండ్రి మురుగన్‌ ఆలంగాయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ సమయంలో ప్రియ, చిన్నారి ఫొటోను పోలీసుల వద్ద ఇచ్చాడు. ఈ ఫొటో ద్వారా చిన్నారి కిర్తికను పోలీసులు గుర్తించారు. ప్రియ చిన్నారిని చెత్త బాక్సులో ఎందుకు వేసి వెళ్లింది అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు