శిశువు కిడ్నాప్.. ఇద్దరు అరెస్ట్‌

5 Jun, 2019 17:34 IST|Sakshi

సాక్షి, నెల్లూరు : జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రిలో కిడ్నాప్‌కు గురైన చిన్నారి కథ సుఖాంతమైంది. బిడ్డను తల్లిదండ్రుల చెంతకు చేర్చారు పోలీసులు. కిడ్నాప్‌కి పాల్పడిన ఇద్దరి మహిళలను అరెస్టు చేశారు. కోట మండలానికి చెందిన లక్ష్మీ మంగళవారం నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ మగబిడ్డకు జన్మనిచ్చారు. బిడ్డ ఏడవడం లేదని అత్యవసర విభాగంలో చేర్చారు. కొద్ది సేపటి తర్వాత ఆ శిశువు తల్లిని అంటూ అత్యవసర విభాగంలోని వచ్చిన ఓ మహిళ బిడ్డను తీసుకొని పరారైంది. బిడ్డను చూసేందుకు లక్ష్మీ కుటుంబ సభ్యులు అత్యవసర విభాగంలోకి వెళ్లగా అక్కడ శిశువు కనిపించలేదు. దీంతో లక్ష్మీ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు సీసీ పుటేజీ ఆధారంగా కిడ్నాప్‌కు పాల్పడిన మహిళను గుర్తించారు. సదరు మహిళ తనకు తెలుసునని ఓ యువకుడు చెప్పడంతో పోలీసులు అప్రమత్తమై కోవూరు ఉన్న మహిళను పట్టుకున్నారు. ఆమెతో పాటు మరో మహిళను కూడా అరెస్టు చేశారు. బిడ్డను లక్ష్మీకి అప్పగించారు. 

మరిన్ని వార్తలు