అయ్యో.. పాపం పసిపాప..

6 Sep, 2019 11:51 IST|Sakshi

అప్పుడే పుట్టిన ఆడ శిశువును కాలువలో పడేసిన వైనం

కాలువలో తేలిన మృతదేహాన్ని చూసి తల్లడిల్లిన స్థానికులు  

సాక్షి, బొబ్బిలి: పట్టణంలోని  పోలవానివలస సమీపంలోని ఓ కాలువలో గురువారం తెల్లవారుజామున అప్పుడే పుట్టిన ఓ ఆడపిల్ల మృతదేహం తేలియాడుతుండడం కలకలం సృష్టించింది. ఎవరో ఇక్కడకు సంచిలో తీసుకువచ్చి  బిడ్డను కాలువలో విసిరేసి సంచి పక్కన పడేసి తేలిగ్గా వెళ్లిపోయింది. దీంతో ఆ పసికందు నీటిలో కొట్టుకుంటూ ఊపిరాడక మృతి చెందింది. దీంతో స్థానికులు కన్నీరుమున్నీరుగా విలపిస్తూ.. ఎవరికి ఏ కష్టం వచ్చిందో చిన్నారిని ఇలా కాలువలో పడేశారని వాపోయారు.

ఒకటి,రెండు రోజుల్లోనే..! 
కాలువలో తేలియాడుతున్న ఆడబిడ్డను చూసిన వారు ఒకటి, రెండు రోజుల్లోపే జన్మించి ఉంటుందని చెబుతున్నారు. మృతదేహం ఉబ్బకపోవడాన్ని బట్టి పుట్టిన వెంటనే కాలువలో పడేసి వెళ్లిపోయినట్లు అనుమానం వ్యక్తం  చేస్తున్నారు.

ఆ క్లిప్పు ఆధారమవుతుందా..? 
శిశువు బొడ్డును కత్తిరించినపుడు  ఆస్పత్రుల్లో క్లిప్‌ పెడతారు. సెప్టిక్‌ కాకుండా, గాలి వెళ్లకుండా భద్రత కోసం పెట్టిన క్లిప్పుతోనే బిడ్డను నీటిలో పడేసి వెళ్లిపోయిన అగంతకుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇప్పుడా క్లిప్పు ఆధారంగా కేసు దర్యాప్తు చేసే అవకాశముందని తెలుస్తోంది. దీని ఆధారంగా ఆస్పత్రులను పరిశీలించి ఆ కర్కశ తల్లిదండ్రులను పట్టుకుని శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు.

 పరిశీలించిన పోలీస్, ఐసీడీఎస్‌ సిబ్బంది..
బొబ్బిలి ఐసీడీఎస్‌ కార్యాలయాల ఎదురుగానే ఆడ శిశువును కాలువలో పడేశారని తెలుసుకున్న పోలీసులు, ఐసీడీఎస్‌ సిబ్బంది సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మా పరిధిలో బాలింతలు లేరని ఐసీడీఎస్‌ సిబ్బంది అంటుండగా.. కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.  

వదిలిపెట్టం..
ఇది హేయమయిన సంఘటన.. చిన్నారిని కాలువలో విసిరేసిన ఎవ్వరైనా వదిలి పెట్టేదిలేదు. ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో విచారిస్తాం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం.
–  వి. ప్రసాదరావు, ఎస్సై, బొబ్బిలి 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

విషాదం: పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లి..

విక్రయించేందుకే బాలుడి కిడ్నాప్‌..

ప్రియురాలిని దూరం చేశాడనే.. భార్య ఫిర్యాదుతో వెలుగులోకి

వైద్యం వికటించి బాలింత మృతి

ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాల పేరుతో మోసం

సెల్‌ఫోన్‌ దొంగల అరెస్టు

మహిళ ప్రాణం తీసిన భూ తగాదా

సహజీవనానికి నిరాకరించిందని నడిరోడ్డుపైనే..

బాలికల ఆచూకీ లభ్యం

అతిథిగృహాల ముసుగులో అకృత్యాలు

కలతల కల్లోలంలో.. తల్లీ బిడ్డల ఆత్మహత్య

కారు ఢీ కొట్టడంతో ఇద్దరు మృతి

‘నన్ను క్షమించండి..మేం చచ్చిపోతున్నాం’

బావిలో దూకి కౌలు రైతు ఆత్మహత్య

ప్రాణం తీసిన రూ.180

బెట్టింగ్‌రాయుళ్ల ఒత్తిళ్లతో వ్యక్తి ఆత్మహత్య

సీసీ కెమెరా తీగలు కత్తిరించి.. పెద్దాసుపత్రిలో దొంగలు 

స్విమ్మింగ్‌ కోచ్‌పై ‘రేప్‌’ ఆరోపణలు!

పుట్టినరోజు కేక్‌లో విషం!

దెయ్యమై వేధిస్తుందేమోనని తల నరికి...

ప్రాణం తీసిన గెట్ల పంచాయతీ

తీహార్‌ జైలుకు చిదంబరం

అమెరికాలో భారతీయ దంపతుల మృతి

అప్పటి నుంచి సతీష్‌పై ద్వేషం పెంచుకున్న హేమంత్‌

ఇంకా అజ్ఞాతంలోనే చింతమనేని ప్రభాకర్‌!

భార్య మృతి తట్టుకోలేక..

మిర్యాలగూడలో రైస్‌మిల్లు వ్యాపారి కుచ్చుటోపీ..! 

యువకుడి హత్యకు ఆధిపత్య పోరే కారణం!

ప్రాణం తీసిన వేగం

కూరగాయల కత్తితో వెంటాడి.. ఆపై

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఆ ఆలోచన నుంచి పుట్టినదే 83

అరుదైన అక్షర

ఈడో రకం

రామచక్కని సీత టైటిల్‌ బాగుంది

హ్యాట్రిక్‌ కాంబినేషన్‌

చివరి క్షణం