మంత్రి పరిటాల వర్గానికి ఎదురుదెబ్బ

9 Feb, 2018 16:43 IST|Sakshi
రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయ కర్త తోపుదుర్తి ప్రకాశ్‌ రెడ్డి

సాక్షి, అనంతపురం: మంత్రి పరిటాల సునీత వర్గానికి అనంతపురం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. వైఎస్సార్ సీపీ రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి 2011లో దాఖలు చేసిన పరువునష్టం కేసు విచారణ పూర్తి అయింది. మంత్రి సునీత సమీప బంధువు ఎల్. నారాయణ చౌదరి రూ. 10 లక్షలు, ఆంధ్రజ్యోతి సిబ్బంది లక్ష రూపాయలు చెల్లించాలని కోర్టు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది.

జూబ్లీహిల్స్ కారుబాంబు కేసులో తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ కేసును విచారించిన న్యాయస్థానం ప్రకాశ్‌రెడ్డికి, ఈ కేసుకు ఎటువంటి సంబంధం లేదని తీర్పు ఇచ్చింది. అనవసరంగా ఆయనపై దుష్ప్రచారం చేసినందుకు తగిన మూల్యం చెల్లించాలని తీర్పు వెలువరించింది. తీర్పు పట్ల తోపుదుర్తి ప్రకాశ్‌ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు