ఎలా కొట్టేశాడో చూడండి!

17 Oct, 2017 20:33 IST|Sakshi

విమానాశ్రయంలో తమ సామాగ్రిని కన్వేయర్‌ బెల్ట్‌ మీద విడిచిపెట్టిన తర్వాత విమానం ఎక్కడానికి ప్రయాణికులు వెళుతుంటారు. అయితే విమాన ప్రయాణికులు తమ సామాగ్రి విషయంలో పునరాలోచించుకోవాల్సిందే. మణిపూర్‌ ముఖ్యమంత్రి ఎన్‌. బిరేన్‌ సింగ్‌ ట్విటర్‌లో షేర్‌ చేసిన మూడు వీడియోలను చూస్తే అందరూ ఇదే మాట అంటారు. థాయలాండ్‌లోని ఫుకెట్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో సింగపూర్‌కు వెళ్లాల్సిన జెట్‌స్టార్‌ విమానంలో సామాగ్రిని తరలించే ఉద్యోగి చేతివాటం ఈ వీడియోల్లో రికార్డైంది.

ఇది బయటకు రావడంతో థర్డ్‌పార్టీ కంపెనీకి చెందిన 27 ఏళ్ల ఉద్యోగిని థాయ్‌లాండ్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు బ్లుటూత్ స్పీకర్‌ దొంగిలించినట్టు గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు. విమానాశ్రయాల్లో జరుగుతున్న దొంగతనాలను నివారించేందుకు జరిపిన రహస్య శోధనలో భాగంగా వీడియోలు చిత్రీకరించినట్టు సమాచారం. అయితే నిందితుడు తాళాలు పగులగొట్టి దొంగతనం చేశాడా, లేదా అనేది స్పష్టం కాలేదు.

>
మరిన్ని వార్తలు