కత్తి మహేష్‌పై దాడి

15 Feb, 2020 08:44 IST|Sakshi

ఖైరతాబాద్‌: సినీ విమర్శకుడు కత్తి మహేష్‌పై భజ్‌రంగ్‌దళ్‌ సభ్యులు దాడికి పాల్పడిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే శుక్రవారం ఉదయం ఐమాక్స్‌లో ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ సినిమా చూసి కారులో బయటికి వస్తున్న కత్తి మహేష్‌పై ఐదుగురు భజ్‌రంగ్‌దళ్‌ సభ్యులు దాడిచేసి కారు అద్దాలు ధ్వంసం చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. దాడికి పాల్పడిన వారిని మాసబ్‌ట్యాంక్‌కు చెందిన బి.రాజ్‌కుమార్, ఖైరతాబాద్‌కు చెందిన వై.వెంకట్, జి.సాయిరాజ, ఎంఎస్‌మక్తాకు చెందిన డి.నాగరాజు, వారాసిగూడకు చెందిన దేవగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు