షేక్‌పేట భూవివాదం కేసు : రూ.30 లక్షలు ఎక్కడివి?

7 Jun, 2020 20:37 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : షేక్‌పేట భూవివాదం కేసులో ఏసీబీ విచారణ కొనసాగుతోంది. నాంపల్లి ఏసీబీ కార్యాలయంలో ఎమ్మార్వో సుజాతను అధికారులు సుదీర్ఘంగా విచారించారు. దాదాపు తొమ్మిది గంటల విచారణ తర్వాత ఎమ్మార్వో సుజాతను ఇంటికి పంపించారు. ఇంట్లో దొరికిన రూ.30 లక్షలపై ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. సికింద్రాబాద్ ఆర్డీవో వసంత కుమారిని పిలిచి అధికారులు వివరాలు సేకరించారు.
(చదవండి : అరెస్ట్‌ చేయకుండా ఉండేందుకు రూ. 3 లక్షలు డిమాండ్‌)

మరోవైపు ఆర్‌ఐ నాగార్జున రెడ్డి విచారణ కొనసాగుతోంది. మరికాసేపట్లో నాగార్జునరెడ్డిని రిమాండ్‌కు తరలించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఎస్సై రవీంద్రనాయక్‌ను రిమాండ్‌కు తరలించారు. బంజారాహిల్స్‌లోని 4865 గజాల భూ వివాదంలో షేక్‌పేట ఆర్‌ఐ నాగార్జునరెడ్డి, బంజారాహిల్స్‌ ఎస్సై రవీందర్‌లను ఏసీబీ అధికారులు శనివారం అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు