ఎంపీ సుమన్‌పై వైరల్ కథనాలు: పోలీసుల స్పందన

7 Jul, 2018 13:24 IST|Sakshi
ఎంపీ బాల్క సుమన్‌

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ ఎంపీ బాల్క సుమన్‌పై రెండు రోజులుగా వైరల్‌ అవుతున్న కథనాలపై శనివారం బంజారాహిల్స్‌ పోలీసులు స్పందించారు. పోలీసులు కథనం ప్రకారం.. నలుగురు వ్యక్తులు ఇంటికి వచ్చి దుర్భాలాషలాడారని గత నెల 7న ఎంపీ సహాయకుడు సునీల్‌ ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఎంపీ సుమన్‌ను కలవాలన్నారని, ఆయన లేకపోవడంపై తనపై దౌర్జన్యానికి దిగినట్టు సునీల్‌ ఫిర్యాదులో పేర్కొన్నాడు. సునీల్‌ ఫిర్యాదు మేరకు నలుగురిపై కేసు నమోదు చేసి విచారణ జరిపారు. ఎంపీ లైంగికంగా వేధించారని ఆరోపిస్తున్న ఇద్దరు మహిళలు విజేత, సంధ్యలపై  ఆరు నెలల క్రితం మంచిర్యాల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైనట్టు వెల్లడించారు. రిమాండ్ కూడా విధించారని, మంచిర్యాలలో రిమాండ్‌​ పూర్తైన తర్వాత.. బయటకు వచ్చిన ఇద్దరు మరో ఇద్దరు యువకులతో కలిసి ఎంపీ ఇంటిపైకి వచ్చి దౌర్జన్యం చేసినట్టు విచారణ వెల్లడైందన్నారు. దీంత్‌ సునీల్‌  పోలీసులును ఆశ్రయించారన్నారు. ఈ కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతుందని తెలిపారు.

బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేసినా.. పద్ధతి మార్చుకోని సంధ్య.. ఫేస్‌బుక్‌లో సుమన్‌ తన భార్యాపిల్లలతో దిగిన ఫొటోను మార్ఫింగ్‌ చేసి, ఆయన భార్య స్థానంలో తన ఫొటోను పెట్టి సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేసింది. దీంతో శుక్రవారం ఉదయం నుంచి వాట్సాప్, ఫేస్‌బుక్‌లలో ‘బాల్క సుమన్‌పై లైంగిక వేధింపుల ఆరోపణ, ప్రధానికి ఇద్దరు జర్నలిస్టుల ఫిర్యాదు, బాధితులపై తప్పుడు కేసు నమోదు’  అంటూ ప్రచారం జరిగింది.  
 

మరిన్ని వార్తలు