దివ్య హత్య కేసు : లొంగిపోయిన వెంకటేశ్‌

19 Feb, 2020 18:07 IST|Sakshi

సాక్షి, సిద్దిపేట : సంచలనం సృష్టించిన బ్యాంకు ఉద్యోగిని దివ్య (23) హత్య కేసులో నిందితుడు వెంకటేశ్‌ బుధవారం వేములవాడ సీఐ శ్రీధర్‌ ఎదుట లొంగిపోయాడు. నిందితున్ని సీఐ శ్రీధర్‌ సిద్దిపేట పోలీసులకు అప్పగించారు. కాగా, వారం రోజుల్లో పెళ్లి పీటలెక్కాల్సిన దివ్య మంగళవారం రాత్రి దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన ఆమె గజ్వేల్‌లోని ఏపీ గ్రామీణ వికాస్‌ బ్యాంకులో అసిస్టెంట్‌ మేనేజర్‌గా పనిచేస్తోంది. బ్యాంకు సమీపంలోనే ఓ ఇంటిపై అంతస్తులో అద్దెకు ఉంటోంది.
(చదవండి : గజ్వేల్‌లో యువతి దారుణ హత్య)

ఆమెకు వరంగల్‌కు చెందిన సందీప్‌ అనే యువకుడితో వివాహం నిశ్చయమైంది. ఈనెల 26న పెళ్లి జరగాల్సి ఉంది. ఈనేపథ్యంలో ఇరు కుటుంబాల వారు పెళ్లి పనుల్లో నిమగ్నమై ఉండగా..ఈ దారుణ ఘటన చోటుచేసుంది. బ్యాంకులో పనులు ముగించుకుని ఇంటికి చేరిన దివ్య.. కాబోయే భర్తతో ఫోన్‌లో మాట్లాడుతుండగా దుండగుడు ఆమెపై కత్తితో దాడి చేశాడు. పదునైన కత్తితో ఆమె గొంతు కోసి పరారయ్యాడు. ఆ సమయంలో దివ్య తల్లిదండ్రులు ఇంట్లో లేకపోవడం.. దివ్య నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో సందీప్‌ బ్యాంకు సిబ్బందికి సమాచారం ఇచ్చాడు. దీంతో చుట్టుపక్కల వారు, తోటి బ్యాంకు ఉద్యోగులు అక్కడకు వచ్చి చూసేసరికి దివ్య రక్తపు మడుగులో ప్రాణాలు కోల్పోయి కనిపించింది. ప్రేమోన్మాదమే తమ కుమార్తె హత్యకు కారణమని దివ్య తల్లిదండ్రలులు కన్నీరుమున్నీరయ్యారు.
(చదవండి : దివ్య హత్య కేసులో మరో కోణం..)
(దివ్య హత్య : పోలీసుల అదుపులో వెంకటేష్‌ తల్లిదండ్రులు)

మరిన్ని వార్తలు