ట్యాప్‌ రిపేర్‌ చేసేందుకు వచ్చి.. అఘాయిత్యం

17 Feb, 2018 10:56 IST|Sakshi
లైంగికదాడి బాధితురాలు (ప్రతీకాత్మక చిత్రం)

సాక్షి, న్యూఢిల్లీ : ఇంట్లో చెడిపోయిన నీటి కుళాయిని సరిచేస్తానంటూ వచ్చి ఓ బ్యాంకు ఉద్యోగిపై వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. గత ఏడాది (2017) డిసెంబర్‌ 19న ఉత్తర ఢిల్లీలో చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలు ఓ బ్యాంకులో సీనియర్‌ ఉద్యోగినిగా పనిచేస్తున్నారు. తనపై లైంగిక దాడి జరిగిన విషయం తెలియడంతో ప్రస్తుతం సహ ఉద్యోగులంతా తీవ్రంగా అవమానిస్తున్నారని బాధితురాలు వాపోతోంది. మరిన్ని వివరాల్లోకి వెళితే.. 29 ఏళ్ల మహిళకు మూడేళ్ల కిందట ఉద్యోగ రీత్యా ఢిల్లీకి బదిలీ అయింది. బ్యాంకు తాళాలు నిర్వహించే బాధ్యత కూడా ఆమె చేతుల్లోనే ఉంది. దీంతో బ్యాంకుకు సమీపంలోనే ఓ ఇల్లును అద్దెకు తీసుకుంది. అది నాలుగంతస్తుల భవనం.

కింద జిమ్‌ సెంటర్‌ ఉండగా మధ్యలో తాను ఉంటున్న పోర్షన్‌ ఉంది. ఆమెకు ఆ ఇంటి యజమాని తప్ప ఎవరూ తెలియదు. ఇంట్లో ఓ పనిమనిషిని పెట్టుకుంది. డిసెంబర్‌ 19న ఇంట్లో నీళ్లు రావడం లేదని పనిమనిషి చెప్పింది. దాంతో ఉద్యోగిని జిమ్‌ నిర్వహిస్తున్న ఇంటి యజమాని కుమారుడికి ఆ విషయం చెప్పగా అతడు సహాయం చేసేందుకు నిరాకరించాడు. ఆ సమయంలో ఆమె చెబుతున్న మాటలు ఆ జిమ్‌లోనే ఉన్న మరో వ్యక్తి విని సాయం చేస్తానంటూ ఆమెను అనుసరించాడు. అయితే ఆ సమయంలో పనిమనిషి కూడా పని ముగించుకుని వెళ్లిపోయింది. కాగా రాత్రి పూట టెర్రస్‌పైకి ఓ వ్యక్తితో కలిసి వెళ్లడం మంచిది కాదని భావించింది. అతడిని తిరిగి పంపించేలోగానే... ఆమెను నేరుగా బెడ్‌రూమ్‌లోకి నెట్టేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ మేరకు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంలో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.

మరిన్ని వార్తలు