సాంఘిక సంక్షేమంలో శాడిస్ట్‌ అధికారి 

4 Aug, 2019 13:14 IST|Sakshi

మహిళా వార్డెన్లకు సెల్‌ఫోన్‌లో వేధింపులు 

ఓ బాధితురాలి ఆత్మహత్యాయత్నం 

పంచాయితీలో క్షమాపణ కోరిన అధికారి

సాక్షి, కర్నూలు :  జిల్లా సాంఘిక సంక్షేమ శాఖకు చెందిన ఓ అధికారి ప్రవర్తన వివాదాస్పదమైంది. మహిళా వార్డెన్లతో సెల్‌ఫోన్‌లో అసభ్యకరంగా మాట్లాడుతూ మానసిక వేధింపులకు గురి చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అలాగే తనిఖీల పేరుతో మహిళా వార్డెన్లు ఉన్న వసతి గృహాలకు ప్రత్యేకంగా వెళ్తూ వారి పట్ల వెకిలి చేష్టలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మనసులో దురుద్దేశాన్ని పెట్టుకొని ఏకవచనంతో సంభాషించడం, రికార్డులు సక్రమంగా లేవంటూ కోపగించుకోవడం, కార్యాలయానికి వచ్చి కలవాలని ఆదేశాలు జారీ చేయడం ఆయనకు పరిపాటిగా మారింది. తాజాగా ఆదోని డివిజన్‌లోని ఓ మహిళా వార్డెన్‌ పట్ల ఆయన ప్రవర్తించిన తీరు వివాదాస్పదమైంది. తీవ్ర మనస్తాపానికి గురైన బాధితురాలు ఆత్మహత్యకు యత్నించినట్లు సమాచారం. దీంతో ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు  మాజీ ఎంపీ బుట్టా రేణుక ద్వారా కలెక్టర్‌కు తెలియజేయాలనే భావించారు. ఈ విషయం సహచర వార్డెన్లకు తెలియడంతో సదరు అధికారిని కాపాడేందుకు రంగంలోకి దిగారు.

బాధితురాలి కుటుంబ సభ్యులకు నచ్చజెప్పి.. పత్తికొండ నియోజకవర్గంలోని ఓ వసతి గృహంలో ఈ నెల 2వ తేదీన పంచాయితీ పెట్టించారు. ఈ పంచాయితీకి ఆదోని డివిజన్‌కు చెందిన పలువురు వసతి గృహ సంక్షేమాధికారులు, సదరు అధికారితో పాటు ఒకరిద్దరు అధికారులు కూడా హాజరైనట్లు సమాచారం. ఈ సందర్భంగా మహిళా వార్డెన్‌ భర్త.. వేధింపులకు గురి చేసిన అధికారిపై చేయి చేసుకునే ప్రయత్నం చేయడంతో అక్కడున్న వారు వారించినట్లు తెలిసింది. ఇక మీదట ఎలాంటి తప్పు చేయబోనని, మహిళా వార్డెన్లను ఏకవచనంతో పిలవనంటూ సదరు అధికారి క్షమాపణ కోరినట్లు తెలిసింది. ఈ విషయంపై జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు యు.ప్రసాదరావును వివరణ కోరగా.. తనకు ఎలాంటి ఫిర్యాదూ అందలేదని, ఒకవేళ ఫిర్యాదు అందితే విచారణ చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు.    

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

పంచాయతీరాజ్‌లో మామూళ్ల పర్వం

నారాయణ కళాశాల విద్యార్థి ఆత్మహత్య

ఐటీఐలో అగ్నిప్రమాదం 

భార్యను హత్య చేసి.. ఇంటికి తాళం వేసి..

బిస్కెట్ల గోదాములో అగ్నిప్రమాదం

తుపాన్‌ మింగేసింది

ఒక్కడు.. అంతులేని నేరాలు

కలెక్టర్‌పై ట్విటర్‌లో అసభ్యకర పోస్టులు

మత్తు వదిలించేస్తారు!

ఆమెతో చాటింగ్‌ చేసి అంతలోనే..

దండుపాళ్యం బ్యాచ్‌లో ఇద్దరి అరెస్టు

కాల్పుల కలకలం.. 20 మంది మృతి

ఆటోలో తిరుగుతూ దొంగతనాలు చేస్తారు

ఎంత పని చేశావు దేవుడా!

పదహారేళ్లకే నిండునూరేళ్లు.. 

కారుతో ఢీ కొట్టిన ఐఏఎస్‌

రాష్ట్రానికో వేషం.. భారీగా మోసం

అలా రూ. 2 కోట్లు కొట్టేశాడు

కాలేజీ విద్యార్థిని హత్య ; కోర్టు సంచలన తీర్పు.!

మీడియా ముందుకు మోస్ట్‌ వాంటెడ్‌ కిడ్నాపర్‌

లాయర్‌ ఫీజు ఇచ్చేందుకు చోరీలు

దారుణం: పీడకలగా మారిన పుట్టినరోజు

టీడీపీ నేత యరపతినేనిపై కేసు నమోదు

కుక్కకు గురిపెడితే.. మహిళ చనిపోయింది!

మద్యంసేవించి ఐఏఎస్‌ డ్రైవింగ్‌.. జర్నలిస్ట్‌ మృతి

తండ్రి మందలించాడని కుమార్తె ఆత్మహత్య

బ్యుటీషియన్‌ ఆత్మహత్య

ఏడో తరగతి నుంచే చోరీల బాట

నకిలీ సర్టిఫికెట్ల గుట్టురట్టు

ప్రేమపెళ్లి; మరణంలోనూ వీడని బంధం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘రాక్షసుడు’కి సాధ్యమేనా!

‘యధార్థ ఘటనల ఆధారంగా సినిమా తీశా’

బిగ్‌బాస్‌ నుంచి జాఫర్‌ ఔట్‌..ఎందుకంటే..

రైఫిల్‌ షూట్‌ పోటీల్లో ఫైనల్‌కు అజిత్‌

సింగిల్‌ టేక్‌లో చేయలేను..!

రష్మిక కోరికేంటో తెలుసా?