ఆ సమయంలో రెండో ఆప్షన్‌ ఉండదు: సీపీ

6 Dec, 2019 20:32 IST|Sakshi

బెంగళూరు : షాద్‌నగర్‌ దిశ హత్యకేసులో నిందితులైన నలుగురిని పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేయడాన్ని బెంగుళూరు పోలీస్‌ కమిషనర్‌ భాస్కర్‌రావు సమర్థించారు. ‘సరైన సమయంలో సరైన చర్య’ అంటూ హైదరాబాద్ పోలీసులను ఆయన ప్రశంసించారు. సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేస్తుండగా నిందితులు పారిపోవడానికి ప్రయత్రిస్తే రెండవ అభిప్రాయం ఉండదని, నిందితులను చంపేయడమే సరైన పని అన్నారు. నవంబర్‌ 27న దిశను అత్యంత దారుణంగా అత్యాచారం చేసి హత్యచేసిన నలుగురు నిందితులను శుక్రవారం ఉదయం పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేసిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో బెంగుళూరు కమిషనర్‌ మాట్లాడుతూ.. తెలంగాణ రాజధానిలో జరిగిన ఈ దారుణ సంఘటన ఎక్కడైనా జరగవచ్చని, ఇలాంటి ఘటనల్లో నేరస్థులను పట్టుకుని సమస్యలను పరిష్కరించడానికి పోలీసులు తీవ్ర కృషి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఒకవేళ కస్టడీ నుంచి నేరస్థులు తప్పించుకుంటే పోలీసులు తీవ్ర ఒత్తిడికి లోనయ్యే వారని, హైదరాబాద్‌ పోలీసులు తీసుకున్న నిర్ణయం అనివార్యమని తెలిపారు. అలాగే సైబర్‌బాద్‌ పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ కర్ణాటకలోని హుబ్బల్లి ప్రాంతానికి చెందినవారని గుర్తు చేశారు. ఒకప్పుడు తాను, సజ్జనార్‌ కలిసి పని చేశామని భాస్కర్‌ రావు ప్రస్తావించారు. 

చదవండి : చట్టం తన పని చేసింది, అంతా 5-10 నిమిషాల్లో

దిశ కేసు: నేరం చేశాక తప్పించుకోలేరు

దిశను చంపిన ప్రాంతంలోనే ఎన్‌కౌంటర్‌

నలుగురు మృగాళ్ల కథ ముగిసింది..

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా