స్నేహగీతంలో మృత్యురాగం

15 Jun, 2019 07:12 IST|Sakshi
ఘటనా స్థలంలో మృతదేహాలు

సాక్షి, విశాఖపట్నం : ఇద్దరూ చిన్ననాటి స్నేహితులు.. కలిసి చదువుకున్నారు.. కలిసే వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు.. బాగా నిలదొక్కుకున్నారు. మరికొంతమందికి ఉపాధి కల్పించారు.వ్యాపార పనుల నిమిత్తమే విశాఖ నుంచి ఒంగోలుకు పయనమాయ్యరు. తోడుగా ఉమ్మడి స్నేహితుడిని తీసుకెళ్లారు. వారి స్నేహబంధాన్ని చూసి మృత్యువుకు కన్ను కుట్టినట్లుంది. దారి కాచి ప్రమాదం రూపంలో దూసుకొచ్చి ఆ స్నేహాన్ని చిదిమేసింది. ప్రాణస్నేహితులిద్దరితోపాటు వారికి తోడుగా వెళ్లిన మూడో స్నేహితుడిని పరలోకానికి లాక్కుపోయింది. ఈ ముగ్గురితోపాటు వెళ్లిన సంస్థ ఉద్యోగి, రెండేళ్ల క్రితమే పెళ్లి చేసుకున్న.. ఇంకా పిల్లలు కూడా లేని ప్రవీణ్‌కుమార్‌ను మృత్యువు కబళించింది.

గుంటూరు జిల్లా వినుకొండ మండలం విట్టంరాజుపల్లి వద్ద శుక్రవారం తెల్లవారుజామున వీరందరూ ప్రయాణిస్తున్న స్కార్ఫియో వాహనం చెట్టును ఢీకొనడంతో సంభవించిన ఘోర ప్రమాదం నాలుగు కుటుంబాలను అంతులేని విషాదంలోకి నెట్టేసింది.ప్రాణస్నేహితుల్లో ఒకరైన కుమారస్వామికి భార్య, ఆరేళ్ల బాబు ఉన్నారు. వెంకటేశ్వరరావుకు భార్య, ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. కుటుంబాలకు పెద్ద దిక్కుగా ఉన్నవారు ఇక లేరని తెలుసుకొని వారంతా దుఃఖసాగరంలో మునిగిపోయారు. ఇక తండ్రి లేరన్న బెంగతో కుమారస్వామి చిన్నారి కొడుకు తల్లి ఒడిలో తలపెట్టుకొని బేలగా చూస్తుంటే.. వెంకటేశ్వరరావు పిల్లలిద్దరూ తండ్రి ఫొటోను పట్టుకొని దీనంగా చూస్తుండటం కుటుంబ సభ్యులు, బంధుమిత్రులను కంటతడి పెట్టించింది.

నగరంలోని రాంనగర్‌కు చెందిన కుమారస్వామి(42), శ్రీవెంకటేశ్వరరావు(42) ఇద్దరూ చిన్ననాటి స్నేహితులు. ఒకటో తరగతి నుంచి డిగ్రీ వరకు కలిసి చదువుకున్నారు. జీవితంలో స్థిరపడడం కోసం ఏదో చేయాలని తపించారు. అక్కయ్యపాలెం శాంతిపురంలో ఉన్న అదుషా టవర్స్‌లో ఈక్యూలర్స్‌ సర్వే సంస్థను ఏర్పాటు చేశారు. ఉన్నతి స్థితికి చేరుకుని జీవితంలో స్థిరపడ్డారు. ప్రభుత్వ స్థలాలు సర్వే చేయడం ఈ సంస్థ విధి. ఈ క్రమంలో సంస్థ పని నిమిత్తం స్కార్పియో వాహనంలో కుమారస్వామి, వెంకటేశ్వరరావుతో పాటు మరో స్నేహితుడు రామకృష్ణ(37), సంస్థ ఉద్యోగి మట్టా ప్రవీణ్‌ రాజ్‌(30) కలిసి ఒంగోలులో చేపట్టిన ప్రాజెక్టు కోసం గురువారం రాత్రి 7 గంటల సమయంలో ఆఫీస్‌ నుంచి బయలుదేరారు. గుంటూరు జిల్లా వినుకొండ మండలం విట్టంరాజుపల్లి గ్రామం వద్ద శుక్రవారం తెల్లవారుజామున వీరు ప్రయాణిస్తున్న స్కార్పియో చెట్టును ఢీకొట్టింది. దీంతో నలుగురూ అక్కడికక్కడే మృతి చెందారు. కుమారస్వామి, వెంకటేశ్వరరావులది రాంనగర్‌ కాగా..ప్రవీణ్‌రాజ్‌ది ఆర్‌అండ్‌బీ దరి ఆంధ్రకేసరినగర్‌. శ్రీవెంకటేశ్వరరావుకు రామకృష్ణ స్నేహితుడు. ఈయనది తూర్పు గోదావరి జిల్లా కొత్తపల్లి గ్రామం. విశాఖలో ఆర్టీసీ డ్రైవర్‌గా పని చేస్తున్నారు. ఈ ఘటనతో విశాఖలో విషాదఛాయలు అలముకున్నాయి. 

శోక సంద్రంలో శ్రీవెంకటేశ్వరరావు కుటుంబం
రాంనగర్‌లోని నివాసం ఉంటున్న మరో మిత్రుడు శ్రీవెంకటేశ్వరరావుకు వాణి సౌజన్యతో 2009 మే 7న వివాహమైంది. ఈ దంపతులకు కుమార్తె కుందన శ్రీవల్లీ(8), కుమారుడు గోవర్థన్‌(5) ఉన్నారు. వెంకటేశ్వరరావు మృతితో భార్య పిల్లలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పిల్లలిద్దరూ అమ్నానాన్నల పెళ్లి ఫొటో చూస్తూ విలపిస్తుండడం అందర్నీ కంటతడి పెట్టించింది. విషయం తెలుసుకున్న బంధువులు, స్నేహితుల పరామర్శలతో వారి ఇల్లు శోక సంద్రంలో మునిగిపోయింది. 

పెద్ద దిక్కును కోల్పోయిన కుమారస్వామి కుటుంబం
రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన కుమారస్వామి రాంనగర్‌లో నివాసం ఉంటున్నారు. ఈయనకు ఫరివిన్‌ బాబీతో 2012 జూన్‌ 8న వివాహమైంది. వీరికి ఆరేళ్ల కుమారుడు ఉన్నాడు. కుమారస్వామికి ఐదుగురు అన్నదమ్ములు. అందరూ కలిసే ఉంటున్నారు. తండ్రి నర్సింహమూర్తి, తల్లి బి.సింహాచలానికి కుమారస్వామి మూడోవాడు. ఇంటి పెద్ద దిక్కును కోల్పోయిన ఈ కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. భార్య ఫరివిన్‌ బాబీ స్పృహ తప్పి పడిపోయింది. వెంటనే డాక్టర్లు వచ్చి వైద్యం అందించారు. తండ్రి చనిపోయాడని తెలిసి ఆరేళ్ల కుమారుడు తల్లి ఒడిలో ఒరిగిపోయాడు. అభయం, శుభం తెలియని కుమారుడితో పాటు భార్య దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి.

బాల్యం నుంచి కలిసిమెలిసి..

కుమారస్వామి, వెంకటేశ్వరరావు బాల్యం నుంచి ఒకరికి ఒకరు ప్రాణ స్నేహితులు. సెయింట్‌ ఆంథోనీ స్కూల్లో చదువుకున్నారు. రాంనగర్‌లో నివాసం ఏర్పాటు చేసుకున్నారు. వ్యాపారం కూడా కలిసి ప్రారంభించారు. వ్యాపారపరంగా ఎక్కడికి వెళ్లినా కలిసి వెళ్తుంటారు. ఈ క్రమంలో గురువారం రాత్రి విశాఖ నుంచి మరో ఉద్యోగి, స్నేహితుడితో కలిసి కారులో వెళ్లగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ప్రాణ స్నేహితులిద్దరూ రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో రెండు కుటుంబాల్లో విషాదఛాయలు అలముకున్నాయి. 

మూగబోయిన కార్యాలయం
అక్కయ్యపాలెం శాంతిపురం దరి అపార్టుమెంట్‌లో ఈక్యూలర్స్‌ సంస్థను స్నేహితులిద్దరూ ప్రారంభించారు. 40 మంది సిబ్బంది ఈ కార్యాలయంలో పని చేస్తున్నారు. యజమానులు మృతి చెందిన వార్త విని ఒక్కసారిగా సిబ్బంది కన్నీరుమున్నీరయ్యారు. తమను చాలా బాగా చూసుకునే వారని సిబ్బంది చెబుతున్నారు. ఎప్పుడూ ఉద్యోగులుగా చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యాలయం మూగబోయింది.

విషాదంలో ప్రవీణ్‌రాజ్‌ కుటుంబం
ఆర్‌అండ్‌బీ దరి ఆంధ్ర కేసరినగర్‌లో ప్రవీణ్‌రాజ్‌ కుటుంబ సభ్యులతో నివాసం ఉంటున్నాడు. వీరు ముగ్గురు అన్నదమ్ములు. ఓ అక్క. ఈయనకు నాలుగేళ్ల కిందట పెళ్లయింది. వీరికి పిల్లలు లేరు. ప్రవీణ్‌రాజ్‌ చిన్నవాడు. ప్రవీణ్‌ చనిపోయినట్టు ఇప్పటికీ భార్యకు తెలియజేయలేదు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నాలాగ ఎంతోమంది ఉన్నారు: ఉదిత్‌ సూర్య

టిక్‌టాక్‌ వీడియోలో విషాదం

కటకటాల్లోకి కామాంధులు 

బాలికకు నీలి చిత్రాలు చూపిన మృగాడు 

నిందితుడు ఆస్పత్రిలో బాధితురాలు జైల్లో!

శుభశ్రీ కేసులో మరో​ మలుపు

జైలుకు పంపారనే కోపంతో..

పాప్‌కార్న్‌ బండిలో పేలుడు

జల్సాలకి అలవాటుపడి..

డూప్లి కేట్‌గాళ్లు!

సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ కుటుంబం ఆత్మహత్య

డబ్బులు పోయినా పట్టించుకోరా..?

‘హిస్టరీ మేకింగ్‌’ పోలీస్‌ అధికారిపై కాల్పులు

రెండో పెళ్లి కేసులో ఆర్మీ ఉద్యోగి..

బైక్‌ లారీ కిందకు వెళ్లిపోవడంతో..

భర్త హత్య కేసులో భార్యకు జీవిత ఖైదు

మద్యం మత్తులో మహిళ వీరంగం

తల్లిని నరికి చంపిన కొడుకు

‘అమ్మ’కు నగ్న వీడియో బెదిరింపులు..సూసైడ్‌ నోట్‌

పోలీసులపై రాళ్లు రువ్విన‘ఎర్ర’కూలీలు

ఏటీఎం కార్డుల క్లోనింగ్‌ ముఠా అరెస్ట్‌

గొడ్డలితో నరికి.. పొలంలో పూడ్చి 

కర్త, కర్మ, క్రియా దేవికా రాణినే.. 

నెల్లూరులో హర్యానా దొంగల ముఠా అరెస్టు

వైఎస్సార్‌సీపీ కార్యకర్త దారుణ హత్య

చిరుత హెలికాప్టర్‌ పేలి ఇద్దరు పైలెట్లు మృతి

ఘోర రోడ్డు ప్రమాదం​: 16 మంది మృతి

హాలీవుడ్‌ సినిమా చూసి..

ఆ చిన్నారుల మృతికి అతను కారణం కాదు

ఈఎస్‌ఐ కుంభకోణంలో కీలక అంశాలు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘సైరా’కు ఆత్మ అదే : సురేందర్‌ రెడ్డి

బిగ్‌బాస్‌ హౌస్‌లో రచ్చ రచ్చే

‘సైరా’  సుస్మిత

నా పిల్లలకు కూడా అదే నేర్పిస్తా : శృతి

ఫ్యామిలీ మ్యాన్‌తో సమంత!

‘భగత్ సింగ్ నగర్’ మోషన్ పోస్టర్ లాంచ్