మావో హత్యాకాండలో భీమవరం మహిళ!

25 Sep, 2018 13:45 IST|Sakshi
అరకు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలను హత మార్చిన ఘటనలో ఉన్న మావోయిస్టు కామేశ్వరి

పశ్చిమగోదావరి, జంగారెడ్డిగూడెం: విశాఖజిల్లా దుంబ్రిగూడ మండలం లిపిట్టిపుట్ట వద్ద మావోయిస్టు హత్యాకాండలో పాల్గొన్న మావోయిస్టులలో భీమవరానికి చెందిన కామేశ్వరి అలియాస్‌ స్వరూప, అలియాస్‌ సింద్రి, అలియాస్‌ చంద్రి, అలియాస్‌ రింకీ ఉ న్నట్లు పోలీసులు ప్రకటించారు. అయితే ఈమె భీమవరంలో కేవలం కొంతకాలం మాత్రమే ఉన్నట్లు తెలిసింది. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను హతమార్చిన వారిలో ముగ్గురిని గుర్తించినట్లు విశాఖ జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ ప్రకటించారు. వీరిలో తూర్పుగోదావరి జిల్లా దుబ్బపాలెం గ్రామానికి చెందిన జలుమూరి శ్రీనుబాబు అలియాస్‌ సునీల్, అలియాస్‌ రైనో, విశాఖ జిల్లా కరకవానిపాలెం గ్రామానికి చెందిన వెంకట రవి చైతన్య అలియాస్‌ అరుణలతో పాటు జిల్లాలోని భీమవరానికి చెందిన కామేశ్వరి అలియాస్‌ స్వరూప, అలియాస్‌ సింద్రి, అలియాస్‌ చంద్రి, అలియాస్‌ రింకీ ఉన్నట్లు ఎస్పీ ప్రకటించారు.

మావోయిస్టు హత్యాకాండలో అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులు గుర్తుపట్టిన వారిలో వీరు ఉన్నట్లు ప్రకటించారు. కామేశ్వరిది శ్రీకాకుళం కాగా, ఈమె తండ్రి ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసి ఉద్యోగ విరమణ పొందినట్లు తెలిసింది. ఈమె తల్లితండ్రులు శ్రీకాకుళంలో ఉండగా, కామేశ్వరిని భీమవరంలో ఒక వ్యక్తికి ఇచ్చి వివాహం చేసినట్లు తె లుస్తోంది. అయితే కొంతకాలం కామేశ్వరి భర్తతో ఉండగా, వీరిద్దరి మధ్య విభేదాలు రావడంతో విడిపోయారు. ఆ తరువాత తూర్పుగోదావరి జిల్లా గోకవరం డిపోలో కామేశ్వరి కండక్టర్‌గా పనిచేసినట్లు సమాచారం. ఆ సమయంలోనే తూర్పుగోదావరి ఏజెన్సీ ప్రాంతానికి విధులు నిమిత్తం వెళ్లడం, అక్కడ మావోయిస్టులు తారసపడటం తదితర ఘటనల నేపథ్యంలో ఈమె మావోయిస్టుల వైపు ఆకర్షితులైనట్లు తెలిసింది. దీంతో 2008–09లో కామేశ్వరి మావోయిస్టుల్లో చేరింది. అప్పటి నుంచి క్రియాశీలక పాత్ర పోషిస్తూ వచ్చింది. మావోయిస్టుల్లో ప్రస్తుతం ఈమె యాక్షన్‌ టీమ్‌ సభ్యురాలిగా ఉన్నట్లు సమాచారం. అయితే కామేశ్వరిది భీమవరం అని ప్రకటించడంతో ఒక్కసారిగా జిల్లావాసులు ఉలిక్కిపడ్డారు. ఎవరీ కామేశ్వరి అంటూ అటు పోలీసు వర్గాలు, ప్రజలు చర్చించుకున్నారు. 

గతంలోనూ జిల్లా నుంచి మావోయిస్టులు
ఆంధ్రా ఒడిసా సరిహద్దులో 2016 అక్టోబర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌ అనంతరం ఏఓబీలో వరుస ఎన్‌కౌంటర్‌లతో 30 మంది మావోయిస్టులు మృ తిచెందగా, ఒక గ్రేహౌండ్‌ కానిస్టేబుల్‌ మృతి చె దారు. మృతిచెందిన మావోయిస్టులో ఇద్దరు జిలê్లవాసులు ఉన్నారు. దేవరపల్లి మండలం పల్లంట్లకు చెందిన దాసు, తాళ్లపూడికి చెందిన దాసు బా వమరిది అయిన కిరణ్‌ మృతి చెందారు. దీంతో అప్పట్లో జిల్లా పోలీసు యంత్రాంగం ఆశ్చర్యానికి గురైంది. జిల్లాలోని సహజంగా ఏజెన్సీ ప్రాంతాల నుంచి మావోయిస్టుల వైపు గిరిజన యువత ఆకర్షితులవుతుంటారు. అయితే మైదాన ప్రాంతం నుంచి ఆకర్షితులై, ఈ రాష్ట్రంలో కాకుండా ఏఓబీ లో మాయిస్టులలో జిల్లావాసులు ఉండటంతో ఆశ్చర్యానికి గురయ్యారు. తాజాగా భీమవరంలో కొంత కాలం ఉన్న కామేశ్వరి మావోయిస్టుల్లో కీలక పాత్ర పోషించడంతో, అసలు జిల్లా నుంచి మావోయిస్టుల్లో చేరిన వారు ఎంతమంది ఉంటా రనేది పోలీసు యంత్రాంగం అంచనా వేస్తోంది. 

మరిన్ని వార్తలు