బిహార్‌ షెల్టర్‌ హోం కేసు: కీలక మలుపు

4 Oct, 2018 13:08 IST|Sakshi

పాట్నా : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బిహార్‌ ముజఫర్‌పూర్‌‌ వసతిగృహంలో బాలికలపై హత్యాచారాలకు పాల్పడిన కేసులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనపై దర్యాప్తు నిమిత్తం కేంద్రం సీబీఐని నియమించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సీబీఐ విచారణలో భాగంగా సికందర్‌పూర్‌ ప్రాంతంలోని శ్మశానంలో ఓ అస్థిపంజరం బయటపడింది. దీన్ని వసతి గృహానికి చెందిన బాలిక అస్థిపంజరంగా భావిస్తున్నారు సీబీఐ అధికారులు. దాంతో ఈ అస్థిపంజరానికి ఫోరెన్సిక్‌ పరీక్షలు, డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించే ఏర్పాట్లు చేశారు.

ఈ కేసులో ప్రధాన నిందితుడు బ్రజేష్‌ ఠాకూర్‌ డ్రైవర్‌ తెలిపిన వివరాలతో ఈ అస్థిపంజరాన్ని గుర్తించినట్లుగా వెల్లడించారు. ల్యాబ్‌ రిపోర్ట్‌ వచ్చిన తరువాత మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని తెలిపారు. కొద్ది రోజుల క్రితం ముజఫర్‌పూర్‌ వసతి గృహంలో దాదాపు 40 మందికి పైగా బాలికలపై అఘాయిత్యాలు జరిగిన వార్త బయటపడడంతో దేశవ్యాప్తంగా సంచలంగా మారిన సంగతి తెలిసిందే. బ్రజేష్‌ ఠాకూర్‌ అనే వ్యక్తి నడుపుతున్న ఎన్జీవో ఆధ్వర్యంలోని వసతి గృహంలో ఈ దారుణాలు చోటుచేసుకున్నాయి.

ఈ క్రమంలో కొందరు బాలికలను చంపి వసతి గృహంలోనే పూడ్చారని వచ్చిన ఆరోపణల నేపథ్యంలో స్థానిక పోలీసులు బాలికలు చూపిన చోట వసతిగృహంలో తవ్వకాలు జరిపారు.. కానీ అక్కడ ఏమీ లభ్యం కాలేదని అధికారులు వెల్లడించారు.
 

మరిన్ని వార్తలు