నెంబర్‌ప్లేట్‌ చీటింగ్‌.. పలువురిపై కేసు

6 Jun, 2020 10:57 IST|Sakshi

నల్లకుంట: ద్విచక్రవాహనాల నంబర్‌ను ట్యాంపరింగ్‌ చేసి, మోటారు వాహన యాక్ట్‌కు విరుద్ధంగా నంబర్‌ ప్లేట్స్‌ తొలగించిన నాలుగు ద్విచక్ర వాహనాలను నల్లకుంట పోలీసులు సీజ్, వాహన యమానులపై చీటింగ్‌ కేసులు నమోదు చేశారు. అడ్మిన్‌ ఎస్‌ఐ వీరశేఖర్‌ తెలిపిన మేరకు.. శుక్రవారం మధ్యాహ్నం వారాసిగూడకు చెందిన సయ్యద్‌ షకార్‌ తన యాక్టివా ద్విచక్రవాహనం(టీఎస్‌10ఈపీ1283)పై అడిక్‌మెట్‌ రోడ్డులో వచ్చాడు. ఆ సమయంలో వాహన తనిఖీలు చేస్తున్న నల్లకుంట పోలీసులు వాహనాన్ని పరిశీలించగా వాహనానికి ముందు వెనకాల ఉన్న నంబర్‌ ప్లేట్స్‌ లేవు.  (పిలియన్‌ రైడర్లకు హెల్మెట్‌.. మిర్రర్‌ మస్ట్‌!)

చిలకల్‌గూడకు చెందిన ప్రైవేటు ఉద్యోగి ఎం.అభిలాష్‌ తన యాక్టివా ద్విచక్రవాహనం (టీఎస్‌10ఈజీ9892)పై వచ్చాడు. అతని వాహనాన్ని నిలిపిచూడగా నంబర్‌ప్లేట్‌లో చివర ఉన్న 2 నెంబర్‌ కనిపించకుండా ట్యాంపరింగ్‌ (నంబర్‌ ప్లేట్‌ వంచాడు) చేశాడు.
నేరేడ్‌మెట్‌కు చెందిన కూరగాయల వ్యాపారి జి.రాజు తన ద్విచక్రవాహనం (టీఎస్‌08జీహెచ్‌2998) పై వచ్చాడు.  పోలీసులు తనిఖీ చేయగా వాహనం నంబర్‌ ప్లేట్‌పై ఉండే చివరి నంబర్‌ 8 కనిపించకుండా ట్యాంపరింగ్‌ చేశాడు.  
పార్శిగుట్టకు చెందిన ఎయిర్‌టెల్‌ ఉద్యోగి ఈర్పుల ప్రవీణ్‌ కుమార్‌ నంబర్‌ ప్లేట్స్‌ తొలగించిన యాక్టివా (టీఎస్‌07జీఈ0809)పై అడిక్‌మెట్‌ రోడ్డులో గల నెబ్రస్కా హోటల్‌ వద్దకు వచ్చాడు. అతని వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు ఆర్సీ ఆధారంగా ఆ వాహనంపై 14 ట్రాఫిక్‌ వయోలెన్స్‌కు సంబందించి  (రూ. 1450) పెండింగ్‌ చలానాలు ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా నంబర్‌ ప్లేట్స్‌ తొలగించిన నాలుగు వాహనాలను సీజ్‌ చేసిన పోలీసులు

మరిన్ని వార్తలు