మోటార్‌ సైకిళ్ల దొంగలు అరెస్ట్‌

8 May, 2019 13:27 IST|Sakshi
మోటార్‌ సైకిళ్లు, ఇద్దరు నిందితులతో భీమవరం వన్‌టౌన్‌ పోలీసులు

పశ్చిమగోదావరి, భీమవరం టౌన్‌: మోటార్‌ సైకిళ్ల దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరిని అరెస్ట్‌ చేసినట్లు వన్‌టౌన్‌ సీఐ పి.చంద్రశేఖరరావు మంగళవారం తెలిపారు. వారి వద్ద నుంచి 7 మోటార్‌ సైకిల్స్‌ స్వాధీనం చేసుకున్నామన్నారు. పట్టణంలో మోటార్‌ సైకిళ్ల దొంగతనాలపై ఎస్సైలు కె.రామారావు, డి.హరికృష్ణతో కలిసి నిఘా పెట్టామన్నారు. తమకు అందిన సమాచారం మేరకు నలుగురిని అదుపులోకి తీసుకున్నామన్నారు. వారిలో ఇద్దరు బాలురు ఉండటంతో జువైనల్‌ హోంకు పంపిస్తున్నట్లు చెప్పారు.

చెడు వ్యసనాలకు అలవాటు పడి ఈ దొంగతనాలకు పాల్పడుతున్నారన్నారు. మోటార్‌ సైకిల్స్‌ దొంగిలించిన తర్వాత వాటిపై తిరుగుతూ పెట్రోల్‌ అయిపోతే నిర్మానుష్య ప్రాంతంలో వదిలివేస్తున్నారని చెప్పారు. దొంగతనాలకు పాల్పడుతున్న ఆకివీడు మండలం గంగనామ్మకోడుకు చెందిన చింత నాని, కాళ్ల మండలం పెదఅమిరం గ్రామానికి చెందిన సరిళ్ల రాజారత్నంను అరెస్ట్‌ చేశామని తెలిపారు. నిందితులను పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన కానిస్టేబుల్‌ టి.ముత్యాలరాజును అభినందించారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కేరళలో ఎస్కేప్‌... శంషాబాద్‌లో అరెస్టు! 

ఉద్యోగాల పేరిట ఘరానా మోసం

ఏసీబీ వలలో బొల్లారం ఎస్‌ఐ, కానిస్టేబుల్‌

మాజీ ప్రేయసికి గుణపాఠం చెప్పాలని..

కుళ్లిన కూతురి శవంతో నెలరోజుల పాటు.. 

97 మంది మృతి: కేంద్రమంత్రిపై కేసు నమోదు

నిర్మాణంలో ఉన్న వాటర్‌ ట్యాంక్‌ కూలి ముగ్గురి మృతి

గుడిలో మద్యం వద్దన్నందుకు పూజారికి కత్తిపోట్లు

విహార యాత్రలో విషాదం..

కాళ్ల పారాణి ఆరకముందే..

కొనసాగుతున్న టీడీపీ దాడులు

చెల్లెలు గృహప్రవేశానికి వెళ్తూ అన్న మృతి

ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

ఆరిన విద్యా దీపం

బెజవాడ.. గజ గజలాడ!

అసభ్యంగా దూషించిందని..

పెట్టుబడులే ముంచేశాయి!

ప్రేమికుడిపై యాసిడ్‌ దాడి

పారిశ్రామికవేత్త ఇంట్లో ఎన్‌ఆర్‌ఐ హల్‌చల్‌

శోభనాన్ని అడ్డుకున్నాడని కన్న తండ్రిని..

వృద్ధ దంపతుల దారుణ హత్య

‘షేర్‌’ ఖాన్‌లు జాగ్రత్త!

అమెరికాలో నలుగురు తెలుగువారు దుర్మరణం

అమెరికాలో దారుణం

డబ్బుల కోసం డ్రైవర్‌ దారుణం

ఎలుకల మందు పరీక్షించబోయి..

వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ విదేశీ యువతి

‘నన్ను కూడా చంపండి’

పోకిరీల వేధింపులు.. బాలిక ఆత్మహత్య 

నకిలీ పోలీసు అరెస్టు..!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

రాజా నరసింహా

ఆ నమ్మకంతోనే కల్కి విడుదల చేస్తున్నాం

పచ్చడి తిని ఆఫీసుకెళ్లారు

నిర్మాతల మండలి ఎన్నికలు వద్దు

సింహానికి మాటిచ్చారు

యువతకు దగ్గరయ్యేలా...