డిశ్చార్జి అయిన కృష్ణ మిలన్‌రావు

9 Dec, 2019 10:56 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బయోడైవర్సిటీ కారు ప్రమాద ఘటనలో నిందితుడు కల్వకుంట్ల కృష్ణ మిలన్‌రావు గచ్చిబౌలిలోని కేర్‌ ఆస్పత్రిలో 16 రోజులుగా చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి  డిశ్చార్జి అయినట్లు రాయదుర్గం సీఐ రవీందర్‌ తెలిపారు. నవంబర్‌ 23న మధ్యాహ్నం బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌ పైనుంచి కారు అదుపు తప్పి నుంచి ఫల్టీలు కొడుతూ రోడ్డుపై పడిన ఘటనలో సత్యవతి(56) అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందగా కుబ్రా(23), బాలరాజ్‌ నాయక్, ప్రణిత గాయాల పాలయ్యారు.

ఈ ఘటనలో గాయపడిన నిందితుడు కృష్ణ మిలన్‌రావు కేర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ నెల 4న హైకోర్టులో లంచ్‌ మోషన్‌ పిటీషన్‌ దాఖలు చేయగా ఈ నెల 12 వరకు అతడిని అరెస్ట్‌ చేయరాదని కోర్టు స్టే ఇచ్చినట్లు సీఐ తెలిపారు. ఐపీసీ 304ఏ సెక్షన్‌ కింద కేసు నమోదు చేశామని, డిసెంబర్‌ 3న ఐపీసీ 304(కల్పబుల్‌ హోమిసైడ్‌ నాట్‌ అమౌంటింగ్‌ టు మర్డర్‌) సెక్షన్‌గా మార్చామన్నారు. 40 కిలో మీటర్ల వేగంతో వెళ్లాలని సూచికల బోర్డులు ఉన్నా, 105.8 కిలో మీటర్ల వేగంతో దూసుకెళ్లినందునే ఈ ప్రమాదం జరిగినట్లు ఆధారాలు సేకరించామన్నారు. ఈ నెల 12న కౌంటర్‌ దాఖలు చేయనున్నట్లు తెలిపారు. లంచ్‌మోషన్‌ పిటిషన్‌లో బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్‌ బ్రిడ్జి ఎస్‌ ఆకారంలో ఉందని, డిజైన్‌ లోపాల కారణంగానే ప్రమాదం జరిగిందని, తన తప్పిదం లేదని, తక్కువ వేగంతోనే కారు నడిపానని, బెయిల్‌ ఇవ్వాల్సిన కేసులో అరెస్ట్‌ చేస్తామని పోలీసులు వేధిస్తున్నారని, బెడ్‌ రెస్ట్‌ అవసరమని నిందితుడు పిటిషన్‌లో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు..

బయో డైవర్సిటీ ఫ్లైఓవర్‌పై ఘోర ప్రమాదం

డిజైన్‌ లోపమేనా?

బయోడైవర్సిటీ ప్రమాదంపై ‘సీన్‌ రీ క్రియేట్‌’

సత్యవాణి కుటుంబానికి రూ.5 లక్షలు

మరిన్ని వార్తలు