అతడి వల్లే ‘బయోడైవర్సిటీ’ ప్రమాదం

10 Dec, 2019 20:56 IST|Sakshi
ప్రమాద ఘటనా స్థలంలో కారు (ఫైల్‌)

సాక్షి, హైదరాబాద్‌: రాజధానిలో కలకలం రేపిన బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌ కారు ప్రమాదం కేసు హైకోర్టుకు చేరింది. ప్రమాదానికి కారకుడు కల్వకుంట్ల కృష్ణ మిలన్‌రావు అని తెలంగాణ హైకోర్టులో దాఖలు చేసిన కౌంటర్‌ పిటిషన్‌లో రాయదుర్గం పోలీసులు పేర్కొన్నారు. ఇంత పెద్ద ప్రమాదానికి కృష్ణ మిలన్‌రావు కారణమని, అతడి నిర్లక్ష్యం వల్లే దుర్ఘటన జరిగిందని వెల్లడించారు. ప్రమాదం జరిగిన సమయంలో కృష్ణ మిలన్‌రావు 120  కిలోమీటర్ల పైగా వేగంతో కారు నడుపుతున్నాడని తెలిపారు. నిర్లక్ష్యంగా అతి వేగంతో కారు నడిపి మహిళ మరణానికి కారకుడైన అతడిని అరెస్ట్‌ చేయడానికి అనుమతి ఇవ్వాలని హైకోర్టును పోలీసులు కోరారు.

కాగా, ఈ నెల 12 వరకు అతడి అరెస్ట్‌పై హైకోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. తనను అరెస్ట్‌ చేయకుండా చూడాలని కృష్ణ మిలన్‌రావు ఈ నెల 4న దాఖలు లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ను విచారించిన ఉన్నత న్యాయస్థానం ఈమేరకు ఆదేశాలు ఇచ్చింది. పోలీసులు కౌంటర్‌ దాఖలు చేసిన నేపథ్యంలో ఈనెల 12న హైకోర్టు విచారణ చేపట్టనుంది.

సంబంధిత వార్తలు..

నా తప్పేంలేదు.. పోలీసులు వేధిస్తున్నారు

బయో డైవర్సిటీ ఫ్లైఓవర్‌పై ఘోర ప్రమాదం

డిజైన్‌ లోపమేనా?

బయోడైవర్సిటీ ప్రమాదంపై ‘సీన్‌ రీ క్రియేట్‌’

మరిన్ని వార్తలు