రియల్టర్‌ వద్ద నుంచి రూ. 2.17 కోట్లు వసూలు

27 Mar, 2019 14:46 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : పదవులు ఇప్పిస్తానని చెప్పడమే కాక కేం‍ద్ర రక్షణ శాఖ మంత్రి సంతకాన్ని ఫోర్జరీ చేసి.. మోసం చేసినందుకుగాను బీజేపీ ప్రధాన కార్యదర్శితో పాటు మరో ఎనిమిది మందిపై కేసు నమోదయ్యింది. వివరాలు.. బీజేపీ జనరల్‌ సెక్రటరీ పీ మురళీధర్ రావు హైదరాబాద్‌కు చెందిన రియల్‌ఎస్టెట్‌ వ్యాపారవేత్త మహిపాల్‌ రెడ్డిని ఫార్మా ఎక్సిల్‌ చైర్మన్‌ని చేస్తానని చెప్పాడు. అందుకు గాను మహిపాల్‌ దగ్గర నుంచి రూ. 2.17 కోట్లను వసూలు చేశాడు

అనంతరం నిర్మలా సీతారామన్‌ సంతకంతో ఉన్న ఓ అపాయింట్‌మెంట్‌ ఆర్డర్‌ని మహిపాల్‌కు ఇచ్చాడు. కానీ సదరు ఉత్తర్వులు నకిలీవే కాక.. మురళీధర్ రావు ఏకంగా నిర్మలా సీతారామన్‌ సంతకాన్ని ఫోర్జరీ చేశాడు. దాంతో మహిపాల్‌ భార్య ప్రవర్ణా రెడ్డి.. మురళీధర్‌ రావు మీద పోలీసులకు ఫిర్యాదు చేసింది. కోర్టు ఆదేశాల మేరకు మురళిధర్‌ రావుతో పాటు మరో ఎనిమింది మంది మీద సరూర్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో సెక్షన్‌ 406, 420, 468, 471, 506, 120-బీ కింద కేసు నమోదయ్యింది.

మరిన్ని వార్తలు