భగ్గుమన్న పాత కక్షలు

21 Jul, 2018 13:02 IST|Sakshi
 గాయపడిన నరేందర్‌గౌడ్‌ 

సూర్యాపేట క్రైం : పాతకక్షలు మనసులో పెట్టుకుని టీఆర్‌ఎస్‌ యువజన విభాగం నాయకుడిపై బీజేపీ యువజన విభాగం నాయకులు కత్తులతో దాడిచేశారు. ఈ ఘటన చివ్వెంల మండలం కుడకుడ గ్రామ శివారులో జరిగింది. పోలీసులు తెలి పిన వివరాల ప్రకారం.. సూర్యాపేట పట్టణం బా లాజీనగర్‌కు చెందిన టీఆర్‌ఎస్‌ యువజన విభాగం నాయకుడు అన్నపూర్ణ నరేందర్‌గౌడ్‌ శుక్రవారం  చివ్వెంల మండలం కుడకుడ గ్రామ శివారులో కొందరు యువకులు ఆడుతున్న క్రికెట్‌ చూసేందుకు అక్కడికి బైక్‌పై వెళ్లాడు.

అప్పటికే వెంబడిస్తున్న తుంగతుర్తి నియోజకవర్గంలోని బీజేపీ తిరుమలగిరి మండల అధ్యక్షుడు సందీ ప్‌నేత, బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు దోసకాయల ఫణినాయుడు, సందీప్, నాగరాజులు కుడకుడ వద్దకు చేరుకున్నారు. బైక్‌పై కూర్చొని క్రికెట్‌ చూ స్తున్న నరేందర్‌గౌడ్‌పై ఒక్కసారిగా పది మందికి పైగా కలిసి కత్తులతో  దాడి చేశారు. çస్పృహ తప్పి పడిపోయిన నరేందర్‌గౌడ్‌ను అక్కడే క్రికెట్‌ ఆడుతున్న యువకులు నేరుగా డీఎస్పీ కార్యాలయం వద్దకు తీసుకెళ్లారు.

అక్కడే ఉన్న సీసీఎస్‌ఐ సీఐ వెంటనే నరేందర్‌గౌడ్‌ను చికిత్స నిమిత్తం ఏరియాస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా బాధితుడు నరేందర్‌గౌడ్‌ విలేకరులతో మాట్లాడారు. తనపై బీజేపీ నాయకులు సందీప్‌నేత, దోసకాయల ఫణినాయుడు, సందీప్, నాగరాజుతో పాటు మరో పది మంది తనపై కత్తులతో దాడిచేశారని తెలి పాడు. గతంలో బీజేపీ కార్యకర్తపై తాను బ్లేడ్‌తో దాడిచేశానన్న కక్షతోనే తనపై దాడికి దిగారన్నారు. గురువారం కూడా ఫణినాయుడుతో గుర్తుతెలియని వ్యక్తులు ఘర్షణలో తన ప్రమేయం లేదని తెలిపాడు.

దాడి చేసిన వారిని శిక్షించాలి

కత్తుల దాడిలో గాయపడి నరేందర్‌గౌడ్‌ ఏరియాస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయాన్ని తెలు సుకున్న జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, మార్కెట్‌ చైర్మన్‌ వైవిలు పరామర్శించారు. అనంతరం వారు మాట్లాడుతూ నరేం దర్‌పై దాడిచేసిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు.

సూర్యాపేట నియోజకవర్గంలో మంత్రి జగదీశ్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రశాంతంగా ఉన్నప్పటికీ.. అలజడులు సృష్టించడం సరికాదన్నారు. రాజకీయ లబ్ధికోసమే హత్యారాజకీయాలకు తెరతీస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి ఘటనలను మానుకోవాలని హెచ్చరించారు. పరామర్శించిన వారిలో కౌన్సిలర్లు షేక్‌ తాహేర్‌పాషా, ఉప్పల ఆనంద్, తూడి నర్సింహ్మరావు, జీడి భిక్షం, కోడి సైదులుయాదవ్, రేపాల పాండు, కడారి సతీష్‌యాదవ్‌  ఉన్నారు.

మరిన్ని వార్తలు