ఆ బీజేపీ ఎమ్మెల్యే మళ్లీ జైలుకు!

28 Apr, 2018 11:45 IST|Sakshi

లక్నో : ఉత్తరప్రదేశ్‌కు చెందిన సీనియర్‌ బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్‌ సింగ్‌ సెంగార్‌ను మళ్లీ జైలుకు తరలించారు. ఉనావ్‌లో 17 ఏళ్ల అమ్మాయిపై అత్యాచారం జరిపిన కేసులో పోలీసుల రిమాండ్‌ ముగియడంతో అతన్ని ఉనావ్‌ జైలుకు తరలించారు. అతనితోపాటు ఈ కేసులో సహ నిందితుడైన శశిసింగ్‌ను ఉనావ్‌ జైలుకు పంపారు.

సెంగార్‌పై పోక్సోస స(బాలలపై లైంగిక నేరాల నిరోధక చట్టం)తోపాటు ఐపీసీ సెక్షన్లు 363 (కిడ్నాప్‌), 366 (మహిళ అపహరణ), 376 (అత్యాచారం), 506 (నేరపూరిత బెదిరింపులు) తదితర సెక్షన్‌ల కింద పోలీసులు అభియోగాలు నమోదుచేశారు. గత ఏడాది జూన్‌ 4న ఎమ్మెల్యే సెంగార్‌ తనపై అత్యాచారం జరిపాడని, ఆ తర్వాత తనను అపహరించి.. ఎమ్మెల్యే ఇంటికి తీసుకెళ్లారని, అక్కడ తనపై ఆయన అనుచరులు గ్యాంగ్‌రేప్‌ జరిపారని బాధితురాలు ఫిర్యాదులో తెలిపారు. నిందితుడు ఎమ్మెల్యే, స్థానికంగా పరపతి కలిగిన వ్యక్తి కావడంతో అతన్ని ఉనావ్‌ జైలు నుంచి వేరే జైలుకు తరలించాలని, తమ కుటుంబానికి ఇప్పటికీ బెదిరింపులు వస్తున్నాయని బాధితురాలి కుటుంబం పేర్కొంటున్నది.

మరిన్ని వార్తలు