క్షుద్రపూజల పేరిట మోసం  

16 May, 2018 11:22 IST|Sakshi
వివరాలు వెల్లడిస్తున్న ఏసీపీ హబీబ్‌ఖాన్‌

ఒకరి అరెస్టు.. 

రూ.1.70 లక్షలు, నాలుగు తులాల బంగారం స్వాధీనం

వివరాలు వెల్లడించిన     ఏసీపీ హబీబ్‌ఖాన్‌

ధర్మారం(ధర్మపురి) : ఇంట్లో లంకెబిందెలున్నాయని.. వాటిని బయటకు తీయాలని లేకుంటే ప్రాణనష్టం సంభవిస్తుందని మాయమాటలు చెప్పి రూ. 4 లక్షలు.. బంగారం వసూలు చేసిన ఘరా నా మోసగాన్ని ధర్మారం పోలీసులు మంగళవా రం ఆరెస్టు చేశారు. పోలీసుస్టేషన్‌లో పెద్దపల్లి ఏసీపీ హబీబ్‌ఖాన్, సీఐ నరేందర్‌ వివరాలు వెల్లడించారు.

ధర్మారం మండలం ఎర్రగుంటపల్లి గ్రా మానికి చెందిన దేవి లచ్చయ్య కూతురు సంకీర్తన 2014లో అనారోగ్యంతో మరణించింది. దీంతో తమ కుటుంబానికి గిట్టనివారు క్షుద్రపూజలు చేస్తున్నారనే అనుమానంతో కరీంనగర్‌ జిల్లా కేంద్రానికి చెందిన తిరునహరి రాజును సంప్రదించాడు. 2016లో లచ్చయ్య ఇంటిని రాజు సందర్శించాడు. ఇంట్లో లంకెబిందెలు ఉన్నాయని.. అందుకే ప్రాణనష్టం జరిగిందని, క్షుద్రపూజలు చేసి వాటిని బయటకు తీయాలని సూచించాడు.

ఇందుకు 11తులాల బంగారం, 11తులాల వెండి, 11 తులాల రాగితో నాగదేవత ప్రతిమ చేయాలని, రూ. 16వేలు ఖర్చవుతుందని చెప్పి తీసుకున్నాడు. 2017లో ఇంటికి వచ్చి పూజలు చేశాడు. ఇందుకు రూ. 4లక్షలు, 4తులాల బంగారం తీసుకున్నాడు. కాగా పూజల తరువాత లంకెబిందెలు లభ్యమవకపోవడంతో మోసపోయామని తెలుసుకున్న దేవి లచ్చయ్య ఈ నెల 8న పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

కేసు నమోదు చేసిన పోలీసులు మంగళవారం రాజును అరెస్టు చేశారు. అతడి వద్ద రూ. 1.70లక్షల నగదు, నాలుగు తులాల బంగా రం స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో ఎస్సై దేవయ్య, ఏఏస్‌ఐ ఎండీ ఆమ్జద్‌ పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు