సిటీలో విస్ఫోటనం

20 May, 2019 07:11 IST|Sakshi
సంఘటనాస్థలంలో ఫోరెన్సిక్, బాంబు నిపుణుల తనిఖీలు

ఎమ్మెల్యే మునిరత్న నివాసం ముందు శక్తివంతమైన పేలుడు  

అనుచరుడు దుర్మరణం  ముక్కలైన దేహం  

బాంబు పేలుడా, రసాయన పదార్థం కారణమా?  

సందేహాల పొగలు పోలీస్‌ ఉన్నతాధికారుల పరిశీలన  

సాక్షి, బెంగళూరు: సమయం.. ఆదివారం ఉదయం 9.45 గంటలు..  ప్రాంతం.. బెంగళూరులోని వయ్యాలికావల్‌ 11వ బీ క్రాస్‌ రాజరాజేశ్వరి నగర ఎమ్మెల్యే మునిరత్న నివాసం వద్ద భారీ విస్ఫోటం.. ఈ సంఘటనలో ఎమ్మెల్యే అనుచరుడు వెంకటేష్‌ (45) అక్కడికక్కడే మరణించారు. పేలుడుకు మృతదేహం గుర్తుపట్టలేనంతగాచితికిపోయింది.  నగరం నడిబొడ్డున పేలుడు జరగడంతో నగరవాసులు ఉలిక్కిపడ్డారు. మూడు నాలుగు వందల మీటర్ల వరకు పేలుడు శబ్ధం ప్రతిధ్వనించింది. దీంతో జనం ఏం జరిగిందోనని కలవరపాటుకు గురయ్యారు. పేలుడు సంగతి దావానలంలా వ్యాపించడంతో ఘటనాస్థలికి తరలివచ్చారు. ఎమ్మెల్యేకు ఉన్న పలు నివాస భవనాల్లో ఇది కూడా ఒకటి. పేలుడు తీవ్రతకు గోడలకు పగుళ్లు వచ్చాయి. 

ముమ్మరంగా పరిశోధన  
సంఘటన స్థలంలో బాంబు స్క్వాడ్‌ బృందం, జాగిలాలను వెంటనే పిలిపించి పరిశీలించారు. న గర పోలీస్‌ కమిషనర్‌ సునీల్‌కుమార్‌ ఘటనాస్థలికి చేరుకుని పర్యవేక్షించారు. ఫోరెన్సిక్‌ రిపోర్టు వచ్చిన తర్వాతే పేలుడుకు కారణాలు తెలిసే అవకాశం ఉందని ఆయన అన్నారు. పేలుడు జరిగిన ప్రాంతంలో ఎవరు సంచరించకుండా గట్టి పోలీసు బందో బస్తు ఏర్పాటు చేశారు. ఫోరెన్సిక్‌ సిబ్బంది పేలుడు శకలాలను, మృతదేహం నమూనాలను సేకరించారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో బాంబు స్క్వాడ్‌ ముమ్మరంగా శోధించింది. 

సంఘటనాస్థలంలో ఫోరెన్సిక్, బాంబు నిపుణుల తనిఖీలు
భారీశబ్ధం, జనం భయభ్రాంతులు  
పేలుడుతో ప్రభావంతో చుట్టుపక్కల ప్రాంతాలైన మల్లేశ్వరం, వయ్యలికావల్, ఇతరత్ర చుట్టుపక్కల ప్రాంతాల్లో గందరగోళం నెలకొంది. పరిసర ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. అసలు పేలుడు వెనుక కారణాలు ఏంటో తెలియక తికమకపడ్డారు. వెంకటేశ్‌ వృత్తిరీత్యా ఒక ధోబీ– టైలర్‌ అని సమాచారం. ఆయనకు ఇద్దరు అన్నలు, ఒక తమ్ముడు ఉన్నారు. కొన్నేళ్ల క్రితం నుంచి వయ్యాలికావల్‌లో ఉంటున్న వెంకటేశ్‌కు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. ఆయన కొత్త ఇల్లు కట్టే ప్రయత్నాలు ఉండేవారు. ఎమ్మెల్యే మునిరత్నకు వెంకటేష్‌ ఒక బాల్య స్నేహితుడు కావడం గమనార్హం. 

ఎమ్మెల్యే విచారం
ఎమ్మెల్యే మునిరత్న మాట్లాడుతూ ఎవరూ ఎలాంటి ఊహాగానాలను, పుకార్లను ప్రచారం చేయొద్దని విజ్ఞప్తి చేశారు. వెంకటేష్‌ మరణం తననెంతో కలచి వేసిందన్నారు. వెంకటేష్, తాను కలసి చిన్నతనంలో ఆడుకునేవారమని చెప్పారు.  

ఏమిటీ కారణం  
పాత ఇంటిని కూల్చి కొత్త ఇంటిని నిర్మాణ పనిలో వెంకటేశ్‌ ఉన్నాడు. ఆదివారం ఉదయం కొత్త ఇంటికి అమర్చే కిటికీలు, తలుపులు, తదితర వస్తువులను పరిశీలించేందుకు వచ్చిన వెంకటేశ్‌ పేలుడుకు బలయ్యారు. ఎమ్మెల్యే నివాసం ఎదురుగా సుమారు 400 చ.అ ఖాళీ స్థలం ఉంది.అందులో కొత్త కట్టడానికి సంబంధించిన సామగ్రి ఉంది. ప్లాస్టిక్‌ మౌల్డింగ్‌ కోసం వినియోగించే ఉద్ధేశంతో తీసుకొచ్చిన కొన్ని రసాయనాల వల్ల పేలుడు జరిగి ఉంటుందని భావిస్తున్నారు. రసాయనాల డబ్బాలను తెరిచే ప్రయత్నంలో పేలుడు జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ఈ రసాయనాలను హైదరాబాద్‌ నుంచి తీసుకొచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వీటిని సరఫరా చేసిన వ్యక్తిని విచారిస్తామని చెప్పారు. లేక నిజంగా బాంబులే పేలాయా? అన్నది విచారణలో తెలుస్తుందని పోలీసు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

సెల్ఫీ వీడియో; నాకు చావే దిక్కు..!

అమీర్‌పేటలో బాంబు కలకలం

దాచాలంటే దాగదులే!

వేర్వేరు చోట్ల ఐదుగురు ఆత్మహత్య

హత్య చేసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు

ప్రేమ పెళ్లి చేసుకొన్న ఆటోడ్రైవర్‌ ఆత్మహత్య!

బస్సులో మహిళ చేతివాటం! ఏకంగా కండక్టర్‌కే..

పెళ్లైన 24 గంటలకే విడాకులు

అత్తింటి ఆరళ్లు! అన్నను ఎందుకు రానిచ్చవంటూ...

ఖాకీ వేషంలో ఉన్న దొంగల అరెస్టు

నగ్నంగా ఉంటే నయమవుతుంది!

నెత్తురోడిన రహదారులు

ఆ రెండు కమిషనరేట్లలో 1000 మంది రౌడీ షీటర్లు!

తప్పతాగి.. పోలీసుపై మహిళ వీరంగం!

చివరిసారిగా సెల్ఫీ..

పెళ్లి పేరుతో మోసం నటుడి అరెస్ట్‌

సినీ నటితో అసభ్య ప్రవర్తన

మోసం.. ఆపై ఆత్మహత్యాయత్నం.!

14 ఏళ్ల బాలికను వేధించిన 74 ఏళ్ల వృద్ధ మృగాడు!

కుమార్తె వద్దకు వెళ్లి తిరిగి వస్తూ..

రాజాంలో దొంగల హల్‌చల్‌

నన్ను ప్రేమించలేదు..అందుకే చంపేశాను

ఫేస్‌బుక్‌ రిలేషన్‌; వివాహితపై అత్యాచారం

రాంప్రసాద్‌ హత్య కేసులో మరో నలుగురు రిమాండ్‌ 

ఉద్యోగాల పేరుతో మోసపోయిన విద్యార్థినిలు

హత్య చేసి.. శవంపై అత్యాచారం

విడాకులు కోరినందుకు భార్యను...

జైలుకు వెళ్లొచ్చినా ఏం మారలేదు..

ఆటోను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

మాజీ ఫుట్‌బాల్‌ ప్లేయర్‌ దారుణ హత్య

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

గుర్తుపట్టారా... తనెప్పటికీ బ్యూటీక్వీనే!

తమన్నా ప్లేస్‌లో అవికానా!

‘పూరి ముఖంలో సక్సెస్‌ కనిపించింది’

బిజీ అవుతోన్న ‘ఏజెంట్‌’

అమ్మదగ్గర కొన్ని యాక్టింగ్‌ స్కిల్స్ తీసుకున్నాను..

నాన్నా.. బయటకు వెళ్లు అన్నాడు!