మృతదేహాల అప్పగింతపై విచారణ రేపటికి వాయిదా

20 Dec, 2019 15:35 IST|Sakshi

 దిశ హత్యాచార నిందితుల మృతదేహాల అప్పగింతపై శుక్రవారం హైకోర్టులో వాడీ వేడిగా వాదనలు జరిగాయి. 

సాక్షి, హైదరాబాద్‌ :  దిశ హత్యాచార నిందితుల మృతదేహాల అప్పగింతపై శుక్రవారం హైకోర్టులో వాడీ వేడిగా వాదనలు జరిగాయి. నిందితుల మృతదేహాలకు తిరిగి పోస్టుమార్టం, ఫోరెన్సిక్‌ పరీక్షలు నిర్వహించి వాటిని వారి కుటుంబసభ్యులకు అప్పగించే వ్యవహారంపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా మృతదేహాల పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవడానికి గాంధీ ఆస్పత్రి సూపరిం‍టెండెంట్‌ విచారణకు హాజరు కావాలని న్యాయస్థానం ఆదేశించింది.

అలాగే మృతదేహాలకు రీపోస్ట్‌మార్టం చేసిన తర్వాతే బంధువులకు అప్పగించాలనుకుంటున్నట్లు న్యాయస్థానం పేర్కొనగా, రీ పోస్ట్‌మార్టం అవసరం లేదని, ఇప్పటికే పోస్ట్‌మార్టం పూర్తి అయినట్లు ప్రభుత్వం తరుఫు న్యాయవాది వాదనలు వినిపించారు. తదుపరి విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. కాగా ఈ నెల 6వ తేదీన చటాన్‌పల్లిలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మహమ్మద్‌ ఆరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చింతకుంట చెన్నకేశవులు మృతి చెందిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి మృతదేహాలు గాంధీ ఆస్పత్రిలో భద్రపరిచారు. 

చదవండి: 

షాకింగ్: దిశ హత్యకు ముందు 9 హత్యలు

షాకింగ్‌: దిశ హత్యకు ముందు 9 హత్యలు

దిశ కేసు: దారి మూసివేత

దిశ: మృతదేహాలను ఏం చేయాలి?

మరిన్ని వార్తలు