-

కాంగ్రెస్‌ నాయకులే దాడి చేశారు : టీఎంసీ

15 Jun, 2019 14:04 IST|Sakshi

కోల్‌కతా : ఓ టీఎంసీ కార్యకర్త ఇంటిపై జరిగిన బాంబు దాడి ఘటనలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. ముషీరాబాద్‌ డోమ్‌కోల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో శుక్రవారం రాత్రి ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇదే సమయంలో కాంగ్రెస్‌, టీఎంసీ కార్యకర్తల మధ్య గొడవ జరగుతుండటం గమనార్హం. ఈ ఘటనలో ముగ్గురు టీఎంసీ కార్యకర్తలు మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వ్యక్తులను సోహెల్‌ రాణా(19), ఖైరుద్దీన్‌ షేక్‌(55)గా గుర్తించారు. ఈ సంఘటనపై క్షతగాత్రుల కుటుంబ సభ్యులు స్పందించారు.

‘ఈ దాడి వెనక కాంగ్రెస్‌ నాయకులు ఉన్నారు. మేము ఇంట్లో నిద్రపోతున్నాం. ఉన్నట్టుండి మా ఇంట్లో బాంబు పేలింది. వారు మా నాన్నను తుపాకీతో కాల్చారు’ అంటున్నాడు ఖైరుద్దీన్‌ షేక్‌ కుమారుడు. అంతేకాక కొన్ని రోజుల కిత్రం తన అంకుల్‌ను కూడా చంపేశారని తెలిపాడు.విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. త్వరలోనే నిందితులను అరెస్ట్‌ చేస్తామని వెల్లడించారు.

మరిన్ని వార్తలు