పుట్టినరోజు డ్రెస్‌ కోసం బాలుడి ఆత్మహత్య

16 Jul, 2020 08:59 IST|Sakshi

గుండంపల్లిలో విషాదం

సాక్షి, మల్లాపూర్‌(కోరుట్ల): ‘అతి గారాబం.. ఆ తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చింది.. ఏది కావాలన్న వెంటనే కొనివ్వాలి.. లేదంటే తాను చచ్చిపోతానంటూ ఆ తల్లిదండ్రులను బెదిరించి తనకు కావాల్సిన వాటిని సాధించుకోవడం ఆ బాలుడుకి అలవాటుగా మారింది. ఈ క్రమంలో గురువారం తన పుట్టినరోజుకు కొత్త డ్రెస్‌తో పాటు కొంత నగదు ఇవ్వాలని పట్టుబట్టడంతో తల్లిదండ్రులు మందలించారు. దీంతో గతంలో మాదిరిగానే తను కోరుకున్నది సాధించుకోవాలని చచ్చిపోతానంటూ ఇంట్లోకి వెళ్లి తలుపు గడియ పెట్టుకున్నాడు. తల్లిదండ్రులు కిటికీల్లోంచి ఎంత పిలిచినా తలుపు తీయకుండా మారం చేశాడు. బయటకు రావాలని స్నేహితులు కోరినా మొండిగా సమాధానం ఇచ్చాడు. కొంచెం సేపు అయ్యాక కోపం చల్లారి వాడే బయటకు వస్తాడని అనుకున్న ఆ తల్లిదండ్రులకు.. చచ్చిపోతున్నట్లు నటిస్తానని తాడుతో ఉరేసుకున్నట్లు బాలుడు ప్రయత్నించేలోగా, తాడు మెడకు బిగియడంతో ప్రాణం గాల్లో కలిసింది’. ఈ సంఘటన బుధవారం మల్లాపూర్‌ మండలం గుండంపల్లిలో విషాదం నింపింది.‍ చదవండి: వివాహేతర సంబంధం తెలుస్తుందని..

పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మ్యాకల నర్సయ్య–విజయ దంపతులకు కుమారుడు నివాస్‌(16), కుమార్తె హరీక(10) సంతానం. నివాస్‌ స్థానిక జెడ్పీ హైసూ్కల్‌లో ఇటీవల పదో తరగతి పూర్తిచేశాడు. కరోనా నేథప్యంలో విద్యాసంస్థలు ప్రారంభం కాకపోవడంతో నివాస్‌ పై చదువులకు వెళ్లకుండా ఇంటి వద్దే ఉంటున్నాడు. నర్సయ్యది నిరుపేద కుటుంబమైనా కుమారుడిని గారాబం చేస్తూ, అతడు అడిగింది ఇచ్చారు. కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో నివాస్‌కు అవసరమయినవి కొనిస్తూ, కొన్నింటిని తిరస్కరిస్తున్నారు. దీంతో తను కోరినవి దక్కించుకోవాలన్న పంతంతో తల్లిదండ్రులను బెదిరించడం మొదలుపెట్టాడు. ఈక్రమంలో కొన్నిసార్లు మందలించడం, కొన్ని సార్లు కొనివ్వడం జరిగింది. కాగా నివాస్‌ తన పుట్టినరోజుకు కొత్త డ్రెస్, కొంత నగదు ఇవ్వాలని పట్టుపట్టడంతో తల్లిదండ్రులు మందలించడంతో కోపంతో ఇంట్లోకి వెళ్లి తలుపు గడియ పెట్టుకొని ఉరేసుకొని ఆత్మహత్య చేసుకోవడంతో తల్లిదండ్రులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రవీందర్‌ తెలిపారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా