బాలుడిని మింగిన నీటిగుంట

14 Jun, 2018 14:12 IST|Sakshi
మృతదేహం వద్ద రోదిస్తున్న తల్లిదండ్రి 

కృష్ణావెనుక జలాల్లో మునిగి పదకొండేళ్ల బాలుడి మృతి

వ్యవసాయం, ఇసుక రవాణాకు ఇష్టానుసారంగా తవ్వకాలు

అధికారుల వైఖరి వల్లే ఘోరం జరిగిందని గ్రామస్తుల ఆగ్రహం

నేరేడుగొమ్ము మండలం వైజాక్‌కాలనీలో విషాదం

చేపల జీవనాధారంగా సాగే ఆ కుటుం బంలో అమావాస్య శోకం నింపింది. మరో రెండు రోజుల్లో కుమారున్ని బడికి పంపించాలని అనుకున్న ఆ తల్లి ఆశలు కృష్ణానది సాక్షిగా ఆవిరయ్యా యి.. సాగర్‌ వెనుక జలాల గుండా అక్రమంగా ఇసుకను తరలించడంతో ఆ ప్రాంతాల్లో బారి గుంతలు చిన్నారుల పాలిట మృత్యుపాశాలవుతున్నాయి.

వ్యవసాయం కోసం తీసిన గుంతను పూడ్చకుండా వదిలేశారు... ఈ క్రమంలోనే తల్లి వెంట ఆటలాడుకుంటూ వెళ్లి న ఓ బాలుడు నీటికుంటలో పడి విగతజీవిగా మారాడు.. ఈ విషాదకర ఘట న నేరెడుగొమ్ము మండలం చిన్నమునిగల్‌ గ్రామపంచాయతీ వైజాక్‌కాలనీ కృష్ణా వెనుక జలాల్లో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం..

చందంపేట(దేవరకొండ)  : వైజాక్‌కాలనీకి చెందిన ఎరుపల్లి జగ్గా, గాయత్రీ దంపతులు కృష్ణా వెనుక జలాల్లో చేపల వేట సాగి స్తూజీవనం సాగిస్తున్నారు.  వీరికి ముగ్గురు సంతానం. రెండో కుమారుడు ఎరుపల్లి తేజ(11) 3వ తరగతి వరకు చదివాడు. వేసవి సెలవులు కావడంతో ఇంటి వద్దే ఉంటున్నాడు. రోజు మాదిరిగానే తండ్రి జగ్గా మంగళవారం రాత్రి కృష్ణా వెనుక జలాల్లో చేపలు పట్టేందుకు వెళ్లాడు.

ప్రతిరోజూ పట్టుకొచ్చిన చేపలను వలలో నుంచి తీసేందుకు గాయత్రీ భర్తకు సాయపడేది. బుధవారం ఉదయం 7గంటల సమయంలో తల్లి వెంట వెళ్లిన తేజ ఆడుకుంటూ ఉన్నాడు. వేటలో పట్టిన చేపలను వలలో నుంచి తీసే పనిలో తల్లిదండ్రులు నిమగ్నమై ఉన్నారు. అక్కడే సమీపంలో ఇటీవల ఇసుక తరలింపు, పంట పొలాలకు నీటిని అందించేందుకు గుంతలు తవ్వారు. అయితే గుంతలను పూడ్చకపోవడంతో ఇటీవల కురిసిన వర్షాలకు గుంతల్లో నీరు చేరాయి.

తేజ ఆ సమీప ప్రాంతాల్లో ఆడుకుంటూ నీటితో నిండిన గుంతలో పడిపోయాడు. తన వెంట వచ్చిన కుమారుడు తేజ ఇంటికి వెళ్లాడని భావించిన తల్లి. అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోయారు. కా నీ తేజ ఇంటికి రాకపోవడంతో పరిసర ప్రాంతాల్లో వెదికారు. ఎంతకు ఆచూకీ లభ్యం కాకపోవడంతో కృష్ణా వెనుక జలాలకు వెళ్లగా విగతజీవిగా పడి ఉన్న కుమారున్ని చూసి ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.

అమావాస్య దాటక స్కూల్‌కు పంపిద్దామనుకున్న కుమారుడు ఇలా విగతజీవిగా మారడంతో ఆ తల్లి రోదన వర్ణణాతీతం. కుమారుడి మృతదేహాన్ని ఒళ్లోపెట్టుకుని ఏడుస్తున్న ఆ తల్లిని ఓదార్చడం ఎవరి తరం కాలేదు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు నేరెడుగొమ్ము ఎస్‌ఐ బాలస్వామి తెలిపారు. 

ముందే హెచ్చరించిన ‘సాక్షి’ 

కృష్ణా వెనుక జలాల గుండా ఇసుకను అక్రమంగా తరలిస్తుండడంతో పాటు పంట పొలాలకు నీటిని అందించేందుకు అక్రమంగా గుంతలు తవ్వుతున్న వైనంపై 2017మే 19న ‘‘యథేచ్ఛగా మట్టి అక్రమ రవాణా’’ అనే శీర్షికన సాక్షి కథనాన్ని ప్రచురించింది. అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడంతో ఈ ప్రాంతం గుండా కాంట్రాక్టర్లు మట్టిని సేకరించడంతో పాటు అక్రమంగా మట్టిని తరలిస్తున్నారు.

వేసవిలో పంట పొలాలకు నీటిని అందించేందుకు కొందరు రైతులు పెద్ద పెద్ద గుంతలు తవ్వడం, తీరా వర్షాలు కురిసే నాటికి వాటిలో నీరు చేరుతోంది. కృష్ణా వెనుక జలాల్లో తీసిన గుంతలు పిల్లల పాలిట మృత్యు ఊబిలవుతున్నాయి.

గతంలో నిర్వహించిన కృష్ణా పుష్కరాల సమయంలో హైదరాబాద్‌కు చెందిన రియలేస్టేట్‌ వ్యాపారి గుత్తినేని లక్ష్మణ్, సుధారాణిలు పుష్కర స్నానం కోసం కుమారుడు హార్థిక్‌(10) ఇలాగే  వదిలేసిన నీటిగుంతలో పడి మృతిచెం దా డు. గుంతలు తీసి వదిలేసిన వారి పట్ల అధికారులు కఠినంగా వ్యవహరించి మున్ముందు ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
 

మరిన్ని వార్తలు