క్రిమిసంహారక మందు తాగిన ఒకటో తరగతి విద్యార్థి

4 Aug, 2018 15:43 IST|Sakshi
నాగసాయి మృతదేహం 

కోదాడఅర్బన్‌ : కోదాడ పట్టణంలోని ఖమ్మం క్రాస్‌రోడ్డులో గల గణేశ్‌నగర్‌లో ట్యూషన్‌ కోసం వెళ్లిన విద్యార్థి శీతల పానీయం అనుకుని బాటిల్‌లోని క్రిమిసంహారక మందు తాగడంతో అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెం దాడు.  పట్టణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకా రం.. గణేషనగర్‌లో నివాసముండే గుంటా మహేశ్వరరావు కుమారుడు నాగసాయి(7) స్థానిక ఓ ప్రైవేట్‌ పాఠశాలలో 1వ తరగతి చదువుతున్నాడు.

మహేశ్వరరావు తన కుమారుడిని అదే కాలనీలోని తోమారెడ్డి ఇంట్లోని ట్యూషన్‌కు పంపిస్తున్నాడు. ఈ క్రమంలో గత నెల 31వ తేదీన ట్యూషన్‌కు వెళ్లిన సమయంలో అక్కడ స్ప్రైట్‌ బాటిల్‌ కనిపించడంతో దానిని శీతలపానీయంగా భావించి తాగాడు. అయితే ఆ బాటిల్‌లో క్రిముల నివారణకు క్రిమిసంహారక మందును కలిపి ఉం చారు. ఈ విషయం తెలియని నాగసాయి దానిని తాగడంతో వాంతులు ప్రారంభమయ్యాయి.

దీం తో నాగసాయిని పట్టణంలోని సిద్ధార్థ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. పరిస్థితి మిషమంగా ఉండడంతో మొదట ఖమ్మం, తరువాత గుంటూరు ఆస్పత్రులకు తరలించారు. గుంటూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నాగసాయి గురువారం రాత్రి మృతి చెందాడు. ఈ సంఘటనలో ఇంటి యజమాని నిర్లక్ష్యం కారణంగా తన కుమారుడు మృతి చెందాడని పేర్కొంటూ నాగసాయి తండ్రి మహేశ్వరరావు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ ఏఎస్‌ఐ సైదా తెలిపారు.

మరిన్ని వార్తలు