విషాదం: ప్రాణం తీసిన గాలిపటం

8 Dec, 2019 18:14 IST|Sakshi

సాక్షి, పరిగి: వికారాబాద్‌ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. విద్యుత్‌ షాక్‌ గురై బాలుడు మృతి చెందిన ఘటన పరిగి మండలం బాహర్పేటలో జరిగింది. ఆదివారం సెలవు దినం కావడంతో ఎంతో సంతోషంగా ఇద్దరు బాలురు గాలిపటం ఎగరవేయడానికి భవనంపైకి వెళ్ళారు. గాలిపటం కరెంట్‌ వైర్లకు చిక్కుకోవడంతో.. పైపు గొట్టంతో తీయడానికి బాలుడు ప్రయత్నించగా విద్యుత్‌ షాక్‌ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో బాలుడి చేతికి షాక్‌ తగలడంతో తీవ్రం గాయపడ్డాడు. బాలుడిని పరిగి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తీవ్రమైన శబ్దంతో కరెంట్ వైర్లు తెగిపడి కింద మరో వ్యక్తికి మీద పడ్డాయి. ఘటనతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు