అదుపు తప్పిన బాలుడు

25 Jun, 2019 09:04 IST|Sakshi
పోలీసులకు చిక్కిన నిందితులు

10 మందితో ముఠా ఏర్పాటు

నగరంలో దందాలు  

చాంద్రాయణగుట్ట: తనకంటే పెద్ద వారిని ముఠాగా ఏర్పాటు చేసుకొని దోపిడీలకు పాల్పడుతున్న ఓ మైనర్‌ బాలుడి ఉదంతాన్ని దక్షిణ మండలం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు బట్టబయలు చేశారు. ఈ ఘటనలో పది మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.  సూత్రధారి మైనర్‌ బాలుడిని జువైనల్‌ హోంకు తరలించారు. నగర టాస్క్‌ఫోర్స్‌ అదనపు డీసీపీ ఎస్‌.చైతన్య కుమార్‌ తెలిపిన మేరకు.. బాల్యం నుంచే నేర ప్రవృత్తిని ఎంచుకున్న బాలుడు శాస్త్రీపురానికి చెందిన మహ్మద్‌ వకీల్‌ అలియాస్‌ పర్వేజ్‌ (21), బహదూర్‌పురాకు చెందిన షేక్‌ హుస్సేన్‌ అలియాస్‌ గోర్‌ (30), కామాటీపురాకు చెందిన మహ్మద్‌ దస్తగిర్‌ (24),  తీగలకుంటకు చెందిన మహ్మద్‌ ఇబ్రహీం అలియాస్‌ మస్తాన్‌ (25), దూద్‌బౌలికి చెందిన గౌస్‌ పాషా (24), జహనుమాకు చెందిన గౌస్‌ మోయినోద్దీన్‌ అలియాస్‌ మాము (64), తాడ్‌బన్‌కు చెందిన మహ్మద్‌ ఇర్ఫాన్‌ అలియాస్‌ ఇమ్రాన్‌ (23), కామాటీపురాకు చెందిన షాబాజ్‌ ఖాన్‌(26), తీగల కుంటకు చెందిన హసన్‌ అంజా (28), కాలాపత్తర్‌కు చెందిన మహ్మద్‌  (19)లను అనుచరులుగా ఏర్పాటు చేసుకొని దోపిడీలకు పాల్పడసాగాడు. సమాచారం అందుకున్న దక్షిణ మండలం టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ మధుమోహన్‌ రెడ్డి నేతృత్వంలోని పోలీసులు వీరిని అరెస్ట్‌ చేశారు. ఇందులో పదో నిందితుడు పరారీలో ఉన్నాడు. నిందితులను తదుçపరి విచారణ నిమిత్తం కామాటీపురా పోలీసులకు అప్పగించారు. నిందితుల వద్ద నుంచి రెండు మోటార్‌ సైకిళ్లు, ఒక డాగర్, ఎనిమిది సెల్‌పోన్లు, రెండు తాళ్లను స్వాధీనం చేసుకున్నారు.  

బాల్యం నుంచే అదుపు తప్పి...  
మైనర్‌గా ఉన్న బాలుడి తండ్రి చిన్న తనంలోనే ముంబైకి వెళ్లడంతో తల్లితో కలిసి ఉన్నాడు. ఆ సమయంలోనే పాఠశాలలో ఉపాధ్యాయులను, తోటి విద్యార్థులను బెదిరిస్తూ అవారాగా మారాడు. మద్యానికి బానిసయ్యాడు. ఏడు కేసులలో ప్రమేయముండి జువైనల్‌ హోంకు వెళ్లి    వచ్చినా తన నేర జీవితాన్ని మార్చుకోకుండా ఏడుగురితో కలిసి గ్యాంగ్‌ను సైతం ఏర్పాటు చేసుకున్నాడు.  వీరందరికి లీడర్‌గా ఉంటూ నేరాలకు పాల్పడసాగాడు. కామాటీపురా అనుమియా గూడ శ్మశాన వాటికను అడ్డాగా చేసుకొని నేరాలు చేయసాగాడు. ఇప్పటికే ఆ యువకుడు రెండు హత్య కేసులతో పాటు ఐదు హత్యాయత్నం కేసులలో ప్రమేయం ఉన్నాడు. ఇటీవల ఫిబ్రవరి మాసంలో కామాటీపురా పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగిన హత్యాయత్నం కేసులో కూడా జువైనల్‌ హోంకు వెళ్లాడు. 

మరిన్ని వార్తలు