మాదాపూర్‌లో బాలుడి పైశాచికత్వం

18 Dec, 2018 18:28 IST|Sakshi

హైదరాబాద్: మాదాపూర్‌లో ఓ బాలుడి పైశాచికత్వం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్‌లో ఉంటున్న 30 మంది అమ్మాయిల నగ్న వీడియోలు తీస్తూ వికృత ఆనందం పొందుతున్నాడు. అమ్మాయిలు బాత్రూమ్‌లో స్నానం చేస్తుండగా.. హాస్టల్ ప్రక్కనే ఉన్న బిల్డింగ్‌లో నుంచి బాలుడు ఆ దృశ్యాలను సెల్‌ఫోన్‌లో చిత్రీకరించాడు. అయితే వీడియో చిత్రీకరిస్తున్న సమయంలో సెల్‌ఫోన్ ఫ్లాష్‌ లైట్ వెలగడంతో ఓ అమ్మాయి వీడియో రికార్డ్ చేస్తున్న విషయాన్ని గుర్తించింది. దీంతో ఈ బాగోతం బట్టబయలైంది. ఆ బాలుడిపై యువతులు మాదాపూర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసిన పోలీసులు బాలుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.వీడియోలను తన దగ్గరే ఉంచుకున్నాడా? లేక స్నేహితులకు ఎవరికైనా పంపించాడా? అన్న అంశంపై పోలీసులు కూపీలాగుతున్నారు. బాలుడు 8వ తరగతి చదువుతున్నట్టుగా పోలీసులు గుర్తించారు. తల్లిదండ్రులే సెల్‌ఫోన్ కొనిచ్చిట్టుగా దర్యాప్తులో తేలింది. సెల్‌ఫోన్‌లో అశ్లీల వీడియోలు చూడటం వల్ల బాలుడి ప్రవర్తనలో మార్పు వచ్చి.. ఇలా వికృత చేష్టలకు తెగబడినట్లు పోలీసులు భావిస్తున్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా