బాల్య వివాహాలకు బ్రేక్‌

27 Apr, 2018 13:11 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ఇచ్ఛాపురం రూరల్‌ : పదో తరగతి విద్యార్థినికి పెళ్లి చేస్తున్నారన్న సమాచారం మేరకు గెస్ట్‌ చైల్డ్‌లైన్‌ బృందం బాల్యవివాహానికి బ్రేక్‌ వేసింది. ఇచ్ఛాపురం మండలం బూర్జపాడు గ్రామానికి చెందిన 15 ఏళ్ల బాలికకు ఈ నెల 28న వివాహం చేస్తున్నట్లు 1098 చైల్డ్‌ లైన్‌కు వచ్చిన సమాచారం మేరకు గురువారం తహసీల్దార్‌ కార్యాలయానికి చైల్డ్‌లైన్‌ సిబ్బంది వెళ్లారు. బాలిక కుటుంబ సభ్యులను తీసుకొ చ్చి తహసీల్దార్‌ ఎం.సురేష్‌ ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు.

నిర్ణీత వయసు వచ్చే వరకు బాలికకు వివాహం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గెస్ట్‌ చైల్డ్‌లైన్‌ కోఆర్డినేట ర్‌ జాస్మీన్‌ కుమారీ, అంగన్‌వాడీ సూపర్‌వైజర్‌ జయలక్ష్మి, ఆర్‌ఐ కృష్ణప్రసాద్‌ రౌళో, సీనియర్‌ అసిస్టెంట్‌ రామకృష్ణ, అంగన్వాడీ కార్యకర్త కృష్ణవేణి పాల్గొన్నారు.

శ్రీకాకుళం రూరల్‌ : మండలంలోని పెదపాడు పరిధిలోని గాంధీనగర్‌లో శుక్రవారం జరగాల్సిన ఓ వివాహానికి ఐసీడీఎస్, చైల్డ్‌లైన్‌ అధికారులు గురువారం అడ్డుకట్ట వేశారు.  గాంధీనగర్‌కు చెందిన 13 ఏళ్ల బాలికను పెదపాడుకు చెందిన యువకుడితో వివాహం జరిపించేందుకు ఇరువర్గాలు సమాయత్తమయ్యారు. ఈ నేపథ్యంలో సమాచారం అందుకున్న అధికారులు బాలిక తల్లిదండ్రులతో మాట్లాడి స్టేట్‌మెంట్‌ తీసుకున్నారు. అలాగే మే 9న పెదపాడులో జరగాల్సిన మరో బాల్య వివాహాన్ని కూడా అడ్డుకుని ఇరువర్గాల కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్‌ ఇచ్చారు.  

మరిన్ని వార్తలు