వరుడు పెళ్లి చేసుకోనన్నాడని..

22 May, 2019 19:31 IST|Sakshi

సాక్షి, ఖమ్మం : జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పెళ్లి కుమారుడు పెళ్లి చేసుకోనన్నాడని, మనస్తాపానికి గురైన పెళ్లి కూతురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ సంఘటన బుధవారం ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఖమ్మంకు చెందిన ఓ యువతికి కొద్దినెలలక్రితం వివాహం నిశ్చయమైంది. రేపు(గురువారం) పెళ్లి జరగాల్సిఉంది. ఈ నేపథ్యంలో పెళ్లి కుమారుడు.. నువ్వు నచ్చలేదంటూ ఆమె ముఖానే తేల్చిచెప్పాడు. దీంతో మనస్తాపానికి గురైన ఆమె పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇది గమనించిన యువతి బంధువులు ఆమెను వెంటనే దగ్గరలోని ఖమ్మం ఆసుపత్రికి తరలించారు.

>
మరిన్ని వార్తలు