పెళ్లి పేరిట మోసం

14 Feb, 2019 12:19 IST|Sakshi

చెన్నై ,టీ.నగర్‌: పెళ్లి చేసుకుంటామని నమ్మించి నగదు కాజేయడంతో మోసపోయిన వరుడి కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వివరాలు బుధవా రం వెలుగులోకి వచ్చాయి. చెన్నై తిరువాన్మియూరు కన్నన్‌ నగర్‌ 3వ మెయిన్‌రోడ్డుకు చెందిన కరుణానిధి మాథ్యు (64) సచివాలయ న్యాయశాఖ విభాగంలో సూపరింటెండెంట్‌గా పని చేసి రిటైర్‌ అయ్యారు. ఇతని కుమారుడు జార్జ్‌ డింటేల్‌ (24). ఇతనికి ప్రముఖ మేట్రిమొని ద్వారా ఆన్‌లైన్‌లో వధువును ఎంపిక చేశారు. పళ్లికరనైకు చెందిన రాధిక అనే వధువు ఫొటోతో పాటు ఫోన్‌నెంబర్‌ అందులో ఉం ది. యువతిని చూడగానే నచ్చడంతో ఫోన్‌ ద్వారా వారిని సంప్రదించారు.

ఇరు కుటుంబాలకు నచ్చడంతో వధువు కుటుంబానికి చెందిన గిరిధరన్, ఉష, రాధిక, రాజేష్‌ వరుడి ఇంటికివచ్చారు. వరుడు నచ్చడంతో తమ అంగీకారం తెలిపి అక్కడ నుంచి వెళ్లిపోయారు. తరువాత ఇరు కుటుంబాలు త్వరలో నిశ్చితార్థం జరిపేందుకు నిర్ణయించి వెళ్లిపోయారు. ఆ సమయంలో తమకు అందాల్సిన నగదు ఇంకా అందలేదని నిశ్చితార్థం సమీపిస్తున్నందున రూ.లక్ష నగదు ఇవ్వాల్సిందిగా వధువు ఇంటి వారు కోరారు. దీంతో వారికి వరుడి కుటుంబీకులు రూ.లక్ష నగదు అందచేశారు. ఇంటి ఆవరణలో నిలిపి ఉంచిన బైక్‌ను చూసిన వధువు కుటుంబీకుల్లో ఒకరు అక్కడి దగ్గర్లో పని ఉందని చెప్పి బైకును తీసుకెళ్లాడు. ఆ తరువాత వారు తిరిగి రాలేదు. సదరు వ్యక్తి నంబర్‌ కు ఫోన్‌ చేయగా స్విచాఫ్‌ వచ్చింది. వధువు కుటుం బం వారు నివశిస్తున్నట్టు చెప్పిన పళ్లికరనైకు నేరుగా వెళ్లి చూడగా ఇంటికి తాళం వేసి ఉంది. పక్కింటి వా రి వద్ద విచారణ జరపగా వారు ఇల్లు ఖాళీ చేసినట్లు వెళ్లినట్టు తెలిపారు. దీంతో దిగ్భ్రాంతి చెందిన వరుడి తండ్రి కరుణానిధి మాథ్యు తిరువాన్మియూరు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదుచేశారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.

మరిన్ని వార్తలు