అత్తింటి వేధింపులతో నవ వధువు ఆత్మహత్య

28 Nov, 2018 13:09 IST|Sakshi
మృతురాలు బ్యూలా

గుంటూరు,పెనమలూరు: పెళ్లి జరిగి ఐదునెలలు కాకముందే వివాహిత అత్తింటి వేధింపుల తాళలేక ఆత్మహత్య చేసుకుంది. పెదపులిపాక గ్రామానికి చెందిన మట్టా బ్యూలా అలియాస్‌ అనుషా (20) గత జూన్‌  28వ తేదీన ఇబ్రహీంపట్నం కొండపల్లికి చెందిన మట్టా శ్రీనివాస్‌ను వివాహం చేసుకుంది. పెళ్లి సందరగా కట్నకానుకలు ఇచ్చారు. వీరు కొండపల్లిలో కాపురం ఉంటున్నారు. భార్యభర్తలు ఆటోనగర్‌లో పని చేస్తున్నారు. అయితే పెళ్లి జరిగిన కొద్దిరోజులకే బ్యూలాకు అత్తింటి వేధింపులు మొదలయ్యాయి.

ఇచ్చిన కట్నం చాలలేదని అత్తమామలు ఇబ్బంది పెడుతుండగా, బ్యూలా పై లేనిపోని అనుమానాలతో భర్త వేధించసాగాడు. దీంతో వారి మధ్య గొడవలు జరుగుతున్నాయి. కాగా సోమవారం రాత్రి బ్యూలా తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి తనను అత్తింటి వారు వేధిస్తున్నారని, తనను పుట్టింటికి తీసుకు వెళ్లాలని కోరింది. దీంతో బ్యూలా తండ్రి దేవరపల్లి శేష య్య బ్యూలాను మంగళవారం కొండపల్లి నుంచి పెదపులిపాకకు తీసుకు వచ్చాడు.  కాగా మధ్యహ్నం బ్యూలా నిద్రపోతానని బెడ్‌రూమ్‌లోకి వెళ్లి పడుకుంది. సాయంత్రం అయినా బ్యూలా లేవలేదని ఆమె గదిలోకి వెళ్లి కుటుంబ సభ్యులు చూడగా చీరతో ఫ్యాన్‌కు ఉరేసుకుని మృతి చెంది ఉంది.అత్తింటి వారిపై కేసుకాగా ఈ ఘటన పై బ్యూలా తండ్రి దేవరపల్లి శేషయ్య ఫిర్యాదు మేరకు బ్యూలా భర్త శ్రీనివాస్, అత్త నిర్మల, మామ లాజర్‌ పై పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు.

మరిన్ని వార్తలు