పారాణింకా ఆరకముందే..

3 Jan, 2019 12:56 IST|Sakshi
మృతిచెందిన నవ వధువు అంజుమ్‌ కౌర్‌(22) భార్య మృతితో విషణ్ణవదనంలో ఎజాజ్‌

కారు ఢీకొని నవవధువు మృతి

కౌతాళం ఎంపీడీఓపై కేసు నమోదు

కర్నూలు, వెల్దుర్తి:  పారాణి ఆరకముందే రోడ్డు ప్రమాదంలో నవ వధువు మృతిచెందింది. ఈ ఘటన వెల్దుర్తి మండలం పెండేకల్‌ సమీపంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. బేతంచెర్లకు చెందిన అంజుమ్‌ కౌర్‌(22), కర్నూలుఅజముద్దీన్‌ నగర్‌కు చెందిన ఎజాజ్‌కు డిసెంబర్‌ 30న నిఖా(పెళ్లి) వధువు స్వగృహంలో జరిగింది. కర్నూలులో వలిమా(మరలు పెళ్లి) అనంతరంవధూవరులుబేతంచెర్లకు చేరుకున్నారు. మంగళవారం వెల్దుర్తిలో ఫంక్షన్‌కు హాజరయ్యారు. ఫంక్షన్‌ ముగిసిన తర్వాత రాత్రి నూతన వధూవరులు ఒక బైక్‌పై, బంధువులు  ఇతర బైక్‌లపై బేతంచెర్లకు తిరుగు ప్రయాణమయ్యారు.

సర్పరాజాపురం మిట్ట అవతల పెండేకల్‌ సమీపాన మలుపుల వద్ద ఎదురుగా వచ్చిన కౌతాళం ఎంపీడీఓ మురళీమోహన మూర్తి కారు వధూవరుల బైక్‌ను ఢీకొంది. ఆయన సొంతూరైన వైఎస్సార్‌ జిల్లా ప్రొద్దుటూరు నుంచి కౌతాళంలో విధులకు హాజరయ్యేందుకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కారు ఢీకొనడంతో బైక్‌పై నుంచి ఎగిరి కిందపడిన నవవధువు అంజుమ్‌ తలకు బలమైన గాయాలయ్యాయి. వెంట బైక్‌లపై వచ్చిన బంధువులు గమనించి వెంటనే ఆమెను కర్నూలు తీసుకెళ్లారు. మొదట ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి.. అనంతరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కోలుకోలేక అర్ధరాత్రి మృతిచెందింది. భర్త స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. మృతురాలి తల్లిదండ్రులు ఇస్మాయిల్, మున్ని, ఇరువురు చెల్లెళ్లు, తమ్ముడు,  బంధువుల రోదనలుమిన్నంటాయి. పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాన్ని  బేతంచెర్లకు తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఎంపీడీఓ మురళీ మోహన మూర్తిపై కేసు నమోదు చేసి..దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పులిశేఖర్‌ తెలిపారు.   

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

జైలుకు వెళ్లొచ్చినా ఏం మారలేదు..

మాజీ ఫుట్‌బాల్‌ ప్లేయర్‌ దారుణ హత్య

ప్రేయసి గొంతుకోసి ‘ఇన్‌స్టాగ్రామ్‌’లో..

150 మంది చిన్నారులకు విముక్తి​

స్కూల్‌లో పిల్లలు కూర్చోబోతుండగా కరెంట్‌ షాక్‌

ప్రేమ పేరుతో వేధింపులు.. బాలిక ఆత్మహత్య

‘బిగ్‌ బాస్‌’పై మరో వివాదం

బైకులు ఢీ; బస్సు కిందపడి ఇద్దరమ్మాయిల దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో ఏఎస్‌ఐ మృతి

చిన్నారిపై లైంగిక దాడి 

తండ్రిని చంపింది పెద్ద కొడుకే..

చెడుపు ప్రచారంతోనే హత్య

రక్షించారు.. కిడ్నాపర్లకే అప్పగించారు

కూరలో మత్తుపదార్థం కలిపి చంపేశాడు

రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

‘ఆధార్‌’ మోసగాడి అరెస్ట్‌

జైషే అనుమానిత ఉగ్రవాది అరెస్టు..!

గర్భవతి అని కూడా చూడకుండా..

మూడు నెలల అనంతరం రిజెక్ట్‌ చేశారు..

తమ్ముడు ప్రేమలేక; అన్న తమ్ముడు లేక...

నటిపై అసభ్యకర కామెంట్లు.. వ్యక్తి అరెస్ట్‌

జూపార్కులో గంధపు చెట్లు మాయం

వేధింపులు తాళలేక మహిళ ఆత్మహత్య

సారా బట్టీలపై ఎక్సైజ్‌ అధికారుల దాడులు

బాలుడి కిడ్నాప్‌ కలకలం

కర్కశత్వానికి చిన్నారుల బలి

చాక్లెట్‌ అనుకుని ఎలుకల మందు తిని..

ప్రియుడితో కలిసి కన్న తల్లే కసాయిగా..

సీఎం పీఏ పేరుతో మోసానికి యత్నం

అందుకే చచ్చిపోవాలనిపించింది

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మూడు నెలల అనంతరం రిజెక్ట్‌ చేశారు..

కంగనా రనౌత్‌కు ‘మెంటలా’!

డ‌బ్బింగ్ కార్యక్రమాల్లో ‘మ‌న్మథుడు 2’

‘సీఎం జగన్‌ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా’

‘నువ్వు ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండాలి క్యాటీ’

షారుక్‌కు మరో అరుదైన గౌరవం