అయ్యో.. హారికా..!

16 Jun, 2019 08:10 IST|Sakshi
ఆసుపత్రి వద్ద రోదిస్తున్న బంధువులు, కుటుంబసభ్యులు, హారిక(ఫైల్‌) 

పెళ్లిపత్రికలు పంచేందుకు వెళ్లి కాబోయే వధువు దుర్మరణం

స్నేహితులను ఆహ్వానించి వస్తుండగా ఢీకొట్టిన లారీ

పెద్దపల్లి జిల్లా సుద్దాలలో ఘటన

సుల్తానాబాద్‌(పెద్దపల్లి): పది రోజుల్లో పెళ్లి.. పెళ్లి పీటలపై కూర్చోవాల్సిన యువతిని మృత్యువు వెంటాడింది. పాడెపైకి చేరేలా చేసింది.. భాజాభజంత్రీతల మధ్య తల్లిదండ్రులు అత్తారింటికి సాగనంపాల్సి ఉండగా.. విధి చిన్నచూపు చూసింది.. చావుడప్పుల మధ్యల శ్మశానానికి తరలించాల్సి వచ్చింది. ఈ హృదయ విదారక సంఘటన సుల్తానాబాద్‌ మండలం సుద్దాల శివారులో చోటు చేసుకుంది.  సుల్తానాబాద్‌ మండలం సుద్దాలకు చెందిన మారేడుకొండ తిరుపతి–పద్మ దంపతులకు కొడుకు, కూతురు హారిక ఉన్నారు. ఇటీవలే హారిక వివాహం నిశ్చయమైంది. ఈనెల 26న పెళ్లి జరగాల్సి ఉంది. ఈ క్రమంలో తన పెళ్లికి స్నేహితులను ఆహ్వానించేందుకు శనివారం సోదరుడు కిరణ్‌తో కలిసి ద్విచక్రవాహనంపై ఓదెల మండలం కొలనూర్‌కు వెళ్లింది.

పెళ్లి కార్డు ఇచ్చి తిరిగి స్వగ్రామానికి బయల్దేరారు. సుద్దాల శివారుకు రాగానే చెరువు మట్టి తరలించే లారీ వెనుక నుంచి బైక్‌ను ఢీకొట్టింది. ఈ సంఘటనలో హారిక తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందింది. కిరణ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గమనించి కిరణ్‌ను ఆస్పత్రికి తరలించారు. పది రోజుల్లో పెళ్లి మేళం మోగాల్సిన ఇంట్లో చావు డప్పు మోగడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

రాంప్రసాద్‌ హత్య కేసులో మరో నలుగురు రిమాండ్‌ 

ఉద్యోగాల పేరుతో మోసపోయిన విద్యార్థినిలు

హత్య చేసి.. శవంపై అత్యాచారం

విడాకులు కోరినందుకు భార్యను...

జైలుకు వెళ్లొచ్చినా ఏం మారలేదు..

ఆటోను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

మాజీ ఫుట్‌బాల్‌ ప్లేయర్‌ దారుణ హత్య

ప్రేయసి గొంతుకోసి ‘ఇన్‌స్టాగ్రామ్‌’లో..

150 మంది చిన్నారులకు విముక్తి​

స్కూల్‌లో పిల్లలు కూర్చోబోతుండగా కరెంట్‌ షాక్‌

ప్రేమ పేరుతో వేధింపులు.. బాలిక ఆత్మహత్య

‘బిగ్‌ బాస్‌’పై మరో వివాదం

బైకులు ఢీ; బస్సు కిందపడి ఇద్దరమ్మాయిల దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో ఏఎస్‌ఐ మృతి

చిన్నారిపై లైంగిక దాడి 

తండ్రిని చంపింది పెద్ద కొడుకే..

చెడుపు ప్రచారంతోనే హత్య

రక్షించారు.. కిడ్నాపర్లకే అప్పగించారు

కూరలో మత్తుపదార్థం కలిపి చంపేశాడు

రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

‘ఆధార్‌’ మోసగాడి అరెస్ట్‌

జైషే అనుమానిత ఉగ్రవాది అరెస్టు..!

గర్భవతి అని కూడా చూడకుండా..

మూడు నెలల అనంతరం రిజెక్ట్‌ చేశారు..

తమ్ముడు ప్రేమలేక; అన్న తమ్ముడు లేక...

నటిపై అసభ్యకర కామెంట్లు.. వ్యక్తి అరెస్ట్‌

జూపార్కులో గంధపు చెట్లు మాయం

వేధింపులు తాళలేక మహిళ ఆత్మహత్య

సారా బట్టీలపై ఎక్సైజ్‌ అధికారుల దాడులు

బాలుడి కిడ్నాప్‌ కలకలం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఇక షురూ

కొత్తదనం లేకపోతే సినిమా చేయను

సాహో వాయిదా?

కొత్తరకం గ్యాంగ్‌స్టర్‌

‘బిగ్‌ బాస్‌’పై మరో వివాదం

టాక్‌ బాగున్నా.. కలెక్షన్లు వీక్‌!