కొద్ది నిమిషాల్లో పెళ్లి.. మేకప్‌తో ఊరేగుతుండగా..

13 Mar, 2020 07:54 IST|Sakshi
పెళ్లి కొడుకు ఊరేగిన కారు

భువనేశ్వర్‌ : హత్యాకాండలో నిందితుడైన వ్యక్తి పెళ్లికొడుకు మేకప్‌తో ఊరేగింపులో ఉండగా పోలీసులు గురువారం అరెస్టు చేశారు. లోగడ జరిగిన హత్యాకాండలో సదరు పెళ్లి కొడుకు ప్రధాన నిందితుడు.  కొద్ది కాలంగా పోలీసులకు చిక్కకుండా అదృశ్యయ్యాడు. చివరికి పెళ్లికొడుకు ముస్తాబుతో మరి కొద్ది సమయంలో తాళి కట్టి దాంపత్య జీవనంలోకి అడుగిడే చివరి క్షణంలో పోలీసులకు చిక్కాడు. కటక్‌ జిల్లాలోని అఠొగొడొ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. పెళ్లి కోసం కారులో ఊరేగుతున్న సమయంలో పోలీసులు గుర్తించి పెళ్లి కొడుకును అదుపులోకి తీసుకున్నారు. పెళ్లి మండపానికి వెళ్లాల్సిన ఘడియల్లో కటకటాల వైపు అడుగు వేయాల్సి రావడం విచారకరం. సమసర్‌పూర్‌ గ్రామానికి చెందిన యువతితో ఢెంకనాల్‌ జిల్లా తాలొబొరొకోట్‌ గ్రామానికి చెందిన యువకుడికి వివాహం నిశ్చయమైంది.

అఠొగొడొ బీరొకిషోర్‌పూర్‌ శివ మందిరంలో వీరిద్దరి వివాహం జరిపించేందుకు సకల ఏర్పాట్లు చేశారు. ఈ పెళ్లికి హాజరయ్యేం దుకు వరుడు ఊరేగుతున్న తరుణంలో గురువారం పోలీసులు నిందితుడైన వరుడిని అరెస్టు చేశారు. అఠొగొడొ సపువా వంతెన పరిసరాల్లో పోలీసులు వరుడిని అదుపులోకి తీసుకున్నట్లు కటక్‌ గ్రామీణ పోలీసు సూపరింటెండెంట్‌ రాధా వినోద్‌ పాణిగ్రాహి తెలిపారు. హత్యాకాండలో సంబంధం ఆరోపణ కింద పెళ్లి కొడుకును అదుపులోకి తీసుకున్నట్లు ఆయన వివరించారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు