అనుమానాస్పద స్థితిలో నవవధువు మృతి

9 Aug, 2019 09:43 IST|Sakshi
శ్రావణిమృతదేహం

కీసర: అనుమానస్పద స్థితిలో ఓ నవవధువు మృతి చెందింది. ఈ సంఘటన గురువారం సాయంత్రం కీసర పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఆర్‌ఎల్‌నగర్‌ సమీపంలో జరిగింది. వివరాలు.. ఒంగోలు జిల్లాకు చెందిన నర్సింహ్మా, అంజమ్మదంపతులు కాప్రాలో స్థిరపడ్డారు. తమ కూతురు శ్రావణి(20)ని గత 5 మాసాల క్రితం  ఆర్‌ఎల్‌నగర్‌లో నివాసం ఉంటున్న  రామంజనేయులకు ఇచ్చి వివాహం చేసారు. పెళ్లి సమయంలోబంగారు ఆభరణాలను రూ.5 లక్షల మేర కట్నం వరుడి కుటుంబానికి అప్పగించారు. వివాహం జరిగిన కొన్ని రోజులనుండే అదనపు కట్నం కోసం  భర్త ఆంజనేయులు, అత్త రేణుకమ్మ, మామవెంకట్రావు,మరిది, ఆడ పడచు, , తరచూ శ్రావణిని వేదిస్తుడేవారు. అదనపు కట్నం కోసం అత్తమామ భర్త వేదింపుల విషయాన్ని శ్రావణి తన తల్లిదండ్రులకు కుడా తెలపడంతో తల్లిదండ్రులు మరో  రూ.5 కుడా ఇచ్చేందుకు అంగికరీంచారు.

గురువారం ఉద యం  శ్రావణి,రామంజనేయులు ఇద్దరిమధ్య గొడవ జరిగింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన శ్రావణి  బాత్‌రూంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన భర్త, కుటుం బసభ్యులు  శ్రావణిని నాగారంలో ఉన్న విజయ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు శ్రావణిని పరిక్షించి అప్పటికే శ్రావణి మృతిచెందిందని నిర్థారించారు. మెడపైనల్లగా కమిలిన  గాయాలు ఉండటంతో అనుమానం వచ్చి కీసర పోలీసులకు సమాచారం అందించారు. కీసర సీఐ నరేందర్‌గౌడ్‌ మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టమ్‌ నిమిత్తం గాంధి ఆసుపత్రికి తరలించారు. శ్రావణి భర్త రామంజనేయు లు, అత్త మామలను  అదుపులోకి తీసుకొని విచారిస్తామన్నారు.  అదనపుకట్నం కోసం  అత్తమామ, భర్త రామంజనేయులు కలిసి తన బిడ్డను పొట్టన పెట్టుకున్నారని మృతురాలి తల్లిదండ్రులు నర్సింహ్మ,అంజమ్మలు బోరున విలఫించారు. 

మరిన్ని వార్తలు