గోవాలో బ్రిటన్‌ మహిళపై లైంగిక దాడి

20 Dec, 2018 14:43 IST|Sakshi
ప్రతీకాత్మకచిత్రం

పనాజి : గోవాలో బ్రిటన్‌ టూరిస్ట్‌పై గుర్తుతెలియని వ్యక్తి లైంగిక దాడికి తెగబడిన ఘటన వెలుగుచూసింది. గోవాలో గురువారం ఉదయం బీచ్‌ వద్దకు వెళుతున్న 48 సంవత్సరాల బ్రిటన్‌ పర్యాటకురాలిపై దుండగుడు ఈ దారుణానికి పాల్పడ్డాడని, లైంగిక దాడి అనంతరం ఆమె వస్తువులను అపహరించాడని పోలీసులు తెలిపారు.

పనాజీకి వంద కిలోమీటర్ల దూరంలోని కనాకొన పట్టణంలో గురువారం తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని, నేరానికి పాల్పడిన నిందితుడు పరారీలో ఉన్నాడని దక్షిణ గోవా పోలీసులు వెల్లడించారు. బాధితురాలు పాలోలెమ్‌ బీచ్‌కు వెళుతుండగా అడ్డగించిన దుండగుడు ఈ దారుణానికి పాల్పడ్డాడని చెప్పారు.

ఒంటరిగా వెళుతున్న మహిళను గమనించిన నిందితుడు ఆమెను రోడ్డు పక్కనే ఉన్న పంటపొలంలోకి బలవంతంగా తీసుకువెళ్లి లైంగిక దాడికి తెగబడ్డాడన్నారు. ఘటన అనంతరం బాధితురాలికి చెందిన మూడు బ్యాగులను దొంగిలించి పారిపోయాడని పోలీసులు చెప్పారు. బాధితురాలు గత పదేళ్ల నుంచి తరచూ గోవాను సందర్శిస్తున్నారని తెలిపారు.

మరిన్ని వార్తలు