కన్నతల్లిని చూసుకునే విషయంలో ఘర్షణ

4 Feb, 2020 08:23 IST|Sakshi

కొట్టుకున్న అన్నా చెల్లెలు కుటుంబాలు

ఐదుగురికి తీవ్ర గాయాలు

దొడ్డబళ్లాపురం : వయసుపైబడ్డ కన్నతల్లిని చూసుకునే విషయంలో కొడుకు, కూతురు ఘర్షణపడి పర్యవసానంగా రెండు కుటుంబాలు వారు కొట్టుకుని ఆస్పత్రిపాలైన సంఘటన దేవనహళ్లి తాలూకాలో చోటుచేసుకుంది. దేవనహళ్లి తాలూకా దొడ్డసాగరహళ్లి గ్రామంలో ఈ సంఘటన జరిగింది. గ్రామస్తురాలైన బిజుమా కుమారుడు ఇమాంసాబ్, కుమార్తె జంగమా కుటుంబాల మధ్య ఘర్షణ జరిగింది. వయసుపైబడ్డ బిజుమా గత 15 సంవత్సరాలుగా కుమార్తె జంగమా ఇంట్లోనే ఉంటోంది. అయితే బిజుమాకు వస్తున్న పెన్షన్‌ డబ్బులను జంగమా ఒక్కతే తింటోందని ఇమాంసాబ్‌ భార్య నన్నిమా జంగుమా గ్రామంలో జంగమా కనిపించినపుడల్లా తిట్టినట్లు సమాచారం.

దీంంతో మనస్తాపం చెందిన జంగమా తల్లిని ఇమాంసాబ్‌ ఇంటికి పంపించేసింది. అయితే ఇమాంసాబ్‌ కుటుంబ సభ్యులు ఆమెను ఇంట్లోకి రానివ్వలేదు. ఇందుకు సంబంధించి ఇరు కుటుంబాలను కూర్చోబెట్టి గ్రామం పెద్దలు మసీదులో పంచాయతీ నిర్వహించారు. ఇలా ఉండగా ఆదివారం రాత్రి ఇమాంసాబ్‌ తరపు మనుషులు జంగమా ఇంటిపై దాడి చేసి కుటుంబ సభ్యులను దుర్భాషలాడి కొట్టారు. జంగమా, ఈమె పిల్లలు బీబీజాన్, రేష్మ, భర్త మౌలా, మనవరాలు అలియాలపై మారణాయుధాలతో దాడి చేయగా వారంతా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను దేవనహళ్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విజయపుర పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు