చెల్లెలిపై అన్న లైంగికదాడి 

23 Jul, 2019 11:02 IST|Sakshi

సాక్షి, ధర్మవరం(అనంతపురం) : మైనర్‌ చెల్లెలిపై అన్న లైంగికదాడికి పాల్పడిన ఘటన అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలో వెలుగులోకి వచ్చింది. డీఎస్పీ వెంకటరమణ సోమవారం విలేకరులకు తెలిపిన వివరాలివీ.. పట్టణంలోని వైఎస్సార్‌ కాలనీకి చెందిన ఓ వ్యక్తికి ఇద్దరు భార్యలు. మొదటి భార్య, ఆమె కుమారుడు ధర్మవరం పట్టణంలోని వైఎస్సార్‌ కాలనీలో నివసిస్తున్నారు. రెండో భార్య, ఆమె కుమార్తె(మైనర్‌ బాలిక) కొత్తచెరువులో ఉంటున్నారు. కుటుంబ యజమాని తన రెండో భార్యను తీసుకుని బెంగళూరుకు వలస వెళ్లాడు.

మైనర్‌ బాలిక ప్రతి రోజూ ధర్మవరం పట్టణంలోని ఓ బట్టల దుకాణంలో పని చేసి రాత్రికి కొత్తచెరువుకు వెళ్తోంది. ఈ క్రమంలో ఆదివారం మొదటి భార్య కుమారుడు తన తల్లి ఊళ్లో లేకపోవడంతో బట్టల దుకాణం నుంచి కొత్తచెరువుకు వెళ్లేందుకు రహదారిపై ఉన్న చెల్లెలు(మైనర్‌ బాలిక)ను తన వెంట ఇంటికి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. అదే రోజు రాత్రి బాధిత బాలిక పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ మేరకు పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇతనికి ఇదివరకే వివాహం కాగా వ్యసనాల కారణంగా భార్య విడిపోయింది. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ వెంకటరమణ తెలిపారు.  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు