తమ్మునికి ఉద్యోగం దక్కరాదని కడతేర్చిన అన్న

8 Aug, 2019 08:51 IST|Sakshi
నిందితుడు కిరణ్‌

తుమకూరు : ఉద్యోగం కోసం రక్తం పంచుకొని పుట్టిన సోదరుడినే అన్న అంతమొందించాడు.  ఈఘటన బుధవారం పట్టనంలోని సరస్వతీపురంలో చోటు చేసుకుంది. కేంద్ర ప్రభుత్వ కార్యాయంలో ఉద్యోగం చేస్తున్న పుట్టయ్య అనే వ్యక్తి కొద్ది కాలం క్రితం మృతి చెందాడు.  కారుణ్య నియామకాల్లో భాగంగా  పుట్టయ్య పెద్ద కుమారుడు కిరణ్‌కు ఉద్యోగం ఇవ్వాలని అధికారులు నిర్ణయించగా కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. కిరణ్‌ దురలవాట్లకు బానిసయ్యాడని, ఆ ఉద్యోగాన్ని పుట్టయ్య ద్వితీయ తనయుడు కిశోర్‌కు  ఇవ్వాలంటూ అధికారులను కోరారు. దీంతో కిశోర్‌పై కిరణ్‌ కక్ష పెంచుకున్నాడు.  మంగళవారం రాత్రి కుటుంబ సభ్యుల ఎదుటే కత్తితో కిశోర్‌పై కిరణ్‌ దాడి చేశాడు.ఘటనలో కిశోర్‌కు తీవ్రగాయాలు కావడంతో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు.కేసు నమోదు చేసుకున్న జయనగర్‌ పోలీసులు కిరణ్‌ను అరెస్ట్‌ చేశారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు